యూత్ లో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు. అతనికి సంబంధించిన ఏ న్యూస్ బయటకి వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇటివలే లైగర్ సినిమాతో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం శివ నిర్వాణతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ థంబ్స్ అప్ కి సౌత్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు. ఇప్పటికే రౌడీ తుఫాన్ అనే స్పెషల్ ఎడిషన్ థంబ్స్ అప్ బయటకి వచ్చి బాగానే క్లిక్ అయ్యింది.
థంబ్స్ అప్ బ్రాండ్ తో అసోసియేట్ అయిన విజయ్, ఒక యాడ్ షూట్ ని పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. లాంగ్ హెయిర్ తో, యాక్షన్ మోడ్ లో విజయ్ పర్ఫెక్ట్ యాక్షన్ హీరోలా ఉన్నాడు. ఈ ఫోటోలని చూసిన వాళ్లు, ఖుషి సినిమా షూటింగ్ పిక్స్ అనుకోని పొరబడుతున్నారు. ఇదిలా ఉంటే థంబ్స్ అప్ బ్రాండ్ గత పదేళ్లలో ఎప్పుడూలేనంతగా 20% బిజినెస్ పెరిగింది. దీనికి కారణం షారుక్ ఖాన్ మరియు విజయ్ దేవరకొండనే అంటూ రౌడీ ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. గతంలో థంబ్స్ అప్ కంపెనీకి మహేశ్ బాబు సౌత్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే.