Minister Roja: టాలీవుడ్ సీనియర్ నటి, మంత్రి రోజా నేడు తన 50 వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఇక తన పుట్టినరోజునా స్వామివారి ఆశీస్సులు అందుకోవడానికి తిరుపతి వెళ్లిన ఆమె స్వామివారి దర్శనానంతరం మీడియాతో ముచ్చటించారు. అయితే రోజా కూతురు అన్షుమాలిక టాలీవుడ్ ఎంట్రీ గురించి గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా ఆ వార్తలపై కూడా రోజా స్పందించారు.
“నా కూతురు, కొడుకు సినిమాల్లోకి వస్తాను అంటే నేను ఆపను. ఒక తల్లిగా, హీరోయిన్ గా ఎంకరేజ్ చేస్తాను. అయితే నా కూతురు అన్షు చదువుకోవాలని.. సైంటిస్ట్ అవ్వాలనే ఆలోచనలో ఉంది. నాకు తెలిసి ఇప్పుడప్పుడే సినిమాలోకి వచ్చే ఆలోచన అయితే లేదు. తను ఎప్పుడు సినిమాల్లోకి వస్తాను అంటే అప్పుడు నేను కూడా తనను ఆశీర్వదించి పంపిస్తాను” అని చెప్పుకొచ్చింది. ఇక దీంతో అన్షు టాలీవుడ్ ఎంట్రీ గురించి వచ్చిన పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది. ప్రస్తుతం చదువుకుంటున్న అన్షు ముందు ముందు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందేమో చూడాలి అంటున్నారు అభిమానులు.
