Site icon NTV Telugu

RRKPK: వన్ మినిట్ టీజర్ లోనే అలియా భట్ 20 చీరలు మార్చేసింది…

Rrkpk

Rrkpk

కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషి కభీ ఘమ్, కభీ అల్విదా నా కెహనా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్ లాంటి సినిమాలని కరణ్ జోహార్ బ్యూటిఫుల్ గా డైరెక్ట్ చేసాడు. ప్రేమికుల ఎమోషనల్ జర్నీ చూపించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ గా నిలిచినవే. ఈ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ఫీలింగ్స్ ని కరణ్ సూపర్బ్ గా ప్రెజెంట్ చేసాడు. ఎమోషన్స్ ని హార్ట్ టచింగ్ గా చూపించడంలో కరణ్ దిట్ట. అయితే 2016లో వచ్చిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. దీని తర్వాత కరణ్ వెబ్ సీరీస్ ని డైరెక్ట్ చేసాడు, ప్రొడక్షన్ కి మాత్రమే పరిమితం అయ్యాడు కానీ డైరెక్షన్ మాత్రం చెయ్యలేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పడుతూ కరణ్ ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. రణవీర్ సింగ్, ఆలియా భట్ లు ‘గల్లీ బాయ్’ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కరణ్ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా చేస్తున్నాడు.

కరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ధర్మ ప్రొడక్షన్స్ నుంచి ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ టీజర్ ని రిలీజ్ చేసారు. ఆర్జిత్ సింగ్ మ్యాజికల్ వాయిస్ తో మొదలైన ఈ టీజర్ సరిగ్గా నిమిషమున్నర కూడా లేదు కానీ మ్యాజిక్ మాత్రం చాలానే ఉంది. రణ్వీర్ అండ్ అలియా భట్ ల మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది, ఈ ఇద్దరి పెయిర్ చాలా బాగుంది. ట్రెడిషనల్ తో పాటు మోడరన్ లుక్ లో కూడా కనిపించిన అలియా, రణ్వీర్ సింగ్ లు రియల్ లైఫ్ లవర్స్ అనిపించే రేంజులో ఉన్నారు. ఆర్జిత్ సింగ్ వాయిస్ ఈ టీజర్ కి ప్రాణం పోసింది. టీజర్ కి ఇంకో హైలైట్, అలియా భట్ సారీస్. 79 సెకండ్స్ లో అలియా భట్ దాదాపు 20 చీరల్లో కనిపించింది. గ్రాండ్నెస్ ప్రతి ఫ్రేమ్ లో చూపించిన కరణ్, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమాతో జూలై 28న ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

Exit mobile version