Site icon NTV Telugu

RK Roja: అలా అయితే సిగ్గుపడాల.. తలెత్తుకు తిరుగుదాం.. రోజా ఆసక్తికర పోస్ట్

Roja

Roja

RK Roja Intresting post about Politics goes Viral: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 151 స్థానాలు నుంచి ఏకంగా 11 స్థానాలకు పడిపోయింది. ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఒకప్పటి హీరోయిన్ రోజా కూడా ఓటమి పాలయ్యారు. ఆర్కే రోజా నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఆమె తెలుగుదేశం అభ్యర్థి గాలి భాను చేతిలో దారుణంగా ఓటమిపాలయ్యారు. ఇక ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు నుంచే సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ చర్చనీయాంశంగా మారుతున్న రోజా ఈరోజు కూడా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

RGV: ఫలితాల తరువాత మీడియా ముందుకు వర్మ.. జ్ఞానోదయం అయినట్టుందే!

చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల! కానీ.. మంచి చేసి ఓడి పోయాం! గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం! ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం! అంటూ ఆమె తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ పోస్టుకి ఎవరూ కామెంట్ పెట్టకుండా కామెంట్ సెక్షన్ ఆఫ్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రి రోజా పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆమె ఎక్కువగా తెలుగుదేశాన్ని, జనసేన పార్టీలను టార్గెట్ చేస్తూ ఉండేవారు. దీంతో ఆయా పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో రోజాని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టేవారు. ఆమె మీద తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుప్పించేవారు. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుని ఉండవచ్చు అంటున్నారు.

Exit mobile version