Site icon NTV Telugu

Ritu Varma : ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తున్న రీతూ వర్మ..

rituvarma

rituvarma

తెలుగు అందం హీరోయిన్ రీతూ వర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పెళ్లి చూపులు’ హీరోయిన్ రీతూ వర్మ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ కథానాయికగా ఎదిగిన విషయం తెలిసిందే. ‘బాద్షా’ చిత్రంలో కాజల్ చెల్లెలిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత నటిగా సినిమా ఆఫర్లు అందుకుంది. తొలుత ‘ప్రేమ ఇష్క్ కాదల్’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. ఇప్పుడు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. హీరో విజయ్ దేవరకొండ సరసన ‘పెళ్లి చూపులు’ సినిమాలో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం, బాక్సాఫీస్ వద్ద కూడా మంచి రిజల్ట్స్ ను ఇవ్వడంతో అటు విజయ్, ఇటు రీతూ వర్మకు మంచి క్రేజ్ దక్కింది.

మొదటి సినిమాతోనే నటిగా గుర్తింపు దక్కించుకున్న రీతూ వర్మ ఇటు తెలుగులో పాటు అటు తమిళంలోనూ వరుసగా సినిమాలు అందుకుంటూ వచ్చింది. కొన్ని పెద్దగా హిట్లు లేకపోవడంతో ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేవు. చివరిగా నటించిన ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీశ్’, ‘ఒకే ఒక జీవితం’ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. ఇక తమిళ్ సినిమాల్లో నటిస్తూ బాగా పాపులారిటిని సంపాదించుకుంది..

కోలీవుడ్ లో రీతూ రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ‘మార్క్ ఆంటోనీ’, ‘ధృవ నక్షత్రం’ వంటి సినిమాలతో అలరించనుంది. ఈ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.. ఇకపోతే మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం మాత్రం రీతూ వర్మ ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంది. ముఖ్యంగా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. గ్లామర్ షోకు దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ సంప్రదాయ దుస్తుల్లోనూ మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది.. తాజాగా పర్పుల్ కలర్ దుస్తుల్లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతుంది..

 

 

Exit mobile version