NTV Telugu Site icon

Rishab Shetty: ‘హనుమాన్’లో ఆ పాత్ర రిషబ్ శెట్టి మిస్సయ్యాడు.. చేసి ఉంటేనా, అరాచకం అంతే!!

Rishab Shetty For Vibheeshana

Rishab Shetty For Vibheeshana

Rishab Shetty was initial choice for the role of Vibhishan in Hanuman: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది. మొదలైనప్పుడు చిన్న సినిమా గానే మొదలైనా రిలీజ్ అయిన తర్వాత మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడమే కాదు రికార్డు స్థాయి కలెక్షన్స్ కూడా రాబడుతోంది హనుమాన్. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి పది రోజులు పూర్తవుతున్నా సరే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు దూసుకు వెళుతోంది. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. నిన్న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతకు ముందు వరకు ప్రమోషన్స్ లోనే ఉన్న ప్రశాంతర్మ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sai Pallavi: సరదా సరదాకే డాన్స్ అంటే రచ్చ లేపుద్ది.. చెల్లి ఎంగేజ్మెంట్ అంటే ఎలా చేస్తుందో చూసుకో మల్ల!

అదేమిటంటే ఈ సినిమాలో విభీషణుడి పాత్రలో తమిళ స్టార్ యాక్టర్ సముద్రఖని నటించారు. అయితే ఈ పాత్రకు తాను ముందు అనుకున్న వ్యక్తి కన్నడ నటుడు రిషబ్ శెట్టి అని అయితే అప్పటికే ఆయన కాంతార చేసే పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. కాంతార మన దగ్గర రిలీజ్ కాకముందే విభీషణుడి పాత్రకి ఆయన అయితే కరెక్ట్ గా ఉంటాడని నాకనిపించింది. కానీ స్వయంగా దర్శకత్వం వహిస్తూ చేస్తున్న కాంతార సినిమాని పక్కనపెట్టి హనుమాన్ చేయలేకపోతున్నానని ఆయన బాధపడ్డారని చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాబోతున్న పది సినిమాలలో ఏదో ఒక సినిమా ఖచ్చితంగా చేస్తానని మాత్రం ఆయన అప్పుడే మాటిచ్చినట్లుగా ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. అయితే సముద్రఖని చేసిన పాత్రలో ఆయన తన 100% ఎఫర్ట్ పెట్టాడు. కానీ అదే పాత్ర కనుక రిషబ్ శెట్టికి పడి ఉంటే ఆ ఇంపాక్ట్ వేరే లెవల్ లో ఉండేది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి రిషబ్ శెట్టి కాంతార సినిమా బిజీలో ఉండడం వల్ల మరింత ఇంపాక్ట్ మిస్ అయ్యాము అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.