NTV Telugu Site icon

Ring Riyaz: సీఎం జగన్‌ను ట్రోల్ చేసి ఫేమస్.. ఇప్పుడు ఆయన పక్కనే కూర్చుని ఫొటో!

Jagan With Ring Riyaz

Jagan With Ring Riyaz

Ring Riyaz Shared a Picture with AP CM Ys Jagan: బుల్లితెర కామెడీ షోల ద్వారా ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో వలన ఎంతో మంది కొత్త కొత్త కమెడియన్ల వెండితెరకు పరిచయం అయ్యారు, అవుతున్నారు. వారిలో ఒకడు రింగ్ రియాజ్. కామెడీ షోల ద్వారా వచ్చిన క్రేజ్ కంటే ఒక సారి వైఎస్ జగన్ ను ఇమిటేట్ చేసి జగన్ అభిమానులకు టార్గెట్ అయి ఫేమస్ అయ్యాడు. ఆ క్రమంలోనే జనసేన పార్టీకి దగ్గరయి ఆ పార్టీ నుంచి నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ కూడా చేసి ఓడిపోయాడు. అయితే గతంలో జనసేన పార్టీలో ఉన్న రింగ్ రియాజ్ ఒక నెల క్రితం వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా రియాజ్ అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో.. అక్కడే రియాజ్ పనిచేస్తాడు, గతంలోనూ ఇదే మాట చెప్పా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసే నేను వైసీపీలో చేరానని చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కోసం కొత్త ఇల్లు.. వీడియోలు వైరల్!

ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చేస్తున్న డెవలప్మెంట్ ను చూసి, ఆయనను కలిశా,. అప్పుడు ఆయన నన్ను సాదరంగా పార్టీలోకి రావాలని కోరారు. దీంతో నేను వైసీపీలో చేరా, అయితే గతంలో నేను వేరే పార్టీలో ఉన్నాను, ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చాను అని మీరు అనుకోవచ్చు, మళ్లీ స్పష్టం చేస్తున్నా, నేను ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడే పనిచేస్తా అంటూ రింగ్ రియాజ్ చెప్పుకొచ్చాడు. అదంతా ఒక ఎత్తు అయితే తాజాగా రియాజ్ వైఎస్ జగన్ తో పిక్ దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సిద్ధం పేరుతో ఉన్న ఒక షర్ట్ ధరించి మేమంతా సిద్ధం యాత్రలో ఉన్న జగన్ తో రియాజ్ ఈ ఫొటో దిగాడట. ఈ క్రమంలో వైసీపీ అభిమానులు, రియాజ్ భలే ఛాన్స్ పట్టేశాడే అంటూ కామెంట్ చేస్తున్నారు.

Show comments