Site icon NTV Telugu

Ram Gopal Varma : వ్యూహం, శపథం రిలీజ్ డేట్ ప్రకటించిన ఆర్జీవి..

Whatsapp Image 2023 10 11 At 11.16.19 Am

Whatsapp Image 2023 10 11 At 11.16.19 Am

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు ఒక సంచలనం తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు వుండరు.. ఒక సినిమాను అనౌన్స్‌చేయడంలో అలాగే వెరైటీగా ప్రమోషన్స్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ ప్లాన్స్ ఎంతో డిఫరెంట్‌గా ఉంటాయి. తన సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో కాస్త భిన్నంగా ఆలోచిస్తూ వుంటారు వర్మ..ఒక సినిమాని ఊహించని విధంగా ప్రమోట్ చేయడం లో వర్మ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎంతో ఆసక్తి గా మారాయి. ఈ సమయం లో రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఏం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వ్యూహం అనే సినిమాను తెరకెక్కిస్తోన్నాడు . తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ను కూడా ఆయన అనౌన్స్ చేశాడు.ఈ సీక్వెల్‌కు శపథం అనే టైటిల్‌ను ఖరారు చేశాడు. ఒకే పోస్టర్ ద్వారా వ్యూహం మరియు శపథం సినిమాల విడుదల తేదీలని అనౌన్స్‌చేశాడు. వ్యూహం సినిమాను నవంబర్ 10 వ తేదీన, అలాగే వ్యూహం సినిమాకు సీక్వెల్ గా వస్తున్న శపథం సినిమాను 2024 జనవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు.

కుట్రలకీ, ఆలోచనలకు మధ్య అసామాన్యుడిగా ఎదిగిన వైఎస్ జగన్ కథతో ఈ రెండు సినిమాల్ని తెరకెక్కించబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు.అయితే వైఎస్ మరణం తర్వాత జగన్ కుటుంబంలో జరిగిన పరిస్థితులను అలాగే అతడి పై పడ్డ క్రిమినల్ కేసులను వ్యూహం సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రిగా జగన్ ఎలా విజయాన్ని సాధించాడన్నది శపథం సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం.ఆర్జీవి తెరకెక్కిస్తున్న వ్యూహం మరియు శపథం సినిమాల్లో వైఎస్ జగన్ పాత్రలో రంగం ఫేమ్ అజ్మల్ నటిస్తున్నాడు. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించబోతున్నది.ఈ సినిమాలను రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నారు.రీసెంట్ గా వ్యూహం సినిమా నుంచి విడుదల అయినరెండు టీజర్ లు ఎంతో ఆసక్తిని కలిగించాయి. మరి సినిమా విడుదల అయిన తరువాత ఎలాంటి కాంట్రవర్సీ సృష్టిస్తుందో చూడాలి..

Exit mobile version