Ram Gopal Varma : వ్యూహం, శపథం రిలీజ్ డేట్ ప్రకటించిన ఆర్జీవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు ఒక సంచలనం తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు వుండరు.. ఒక సినిమాను అనౌన్స్‌చేయడంలో అలాగే వెరైటీగా ప్రమోషన్స్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ ప్లాన్స్ ఎంతో డిఫరెంట్‌గా ఉంటాయి. తన సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో కాస్త భిన్నంగా ఆలోచిస్తూ వుంటారు వర్మ..ఒక సినిమాని ఊహించని విధంగా ప్రమోట్ చేయడం లో వర్మ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎంతో ఆసక్తి గా మారాయి. ఈ సమయం లో రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఏం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వ్యూహం అనే సినిమాను తెరకెక్కిస్తోన్నాడు . తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ను కూడా ఆయన అనౌన్స్ చేశాడు.ఈ సీక్వెల్‌కు శపథం అనే టైటిల్‌ను ఖరారు చేశాడు. ఒకే పోస్టర్ ద్వారా వ్యూహం మరియు శపథం సినిమాల విడుదల తేదీలని అనౌన్స్‌చేశాడు. వ్యూహం సినిమాను నవంబర్ 10 వ తేదీన, అలాగే వ్యూహం సినిమాకు సీక్వెల్ గా వస్తున్న శపథం సినిమాను 2024 జనవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు.
కుట్రలకీ, ఆలోచనలకు మధ్య అసామాన్యుడిగా ఎదిగిన వైఎస్ జగన్ కథతో ఈ రెండు సినిమాల్ని తెరకెక్కించబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు.అయితే వైఎస్ మరణం తర్వాత జగన్ కుటుంబంలో జరిగిన పరిస్థితులను అలాగే అతడి పై పడ్డ క్రిమినల్ కేసులను వ్యూహం సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రిగా జగన్ ఎలా విజయాన్ని సాధించాడన్నది శపథం సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం.ఆర్జీవి తెరకెక్కిస్తున్న వ్యూహం మరియు శపథం సినిమాల్లో వైఎస్ జగన్ పాత్రలో రంగం ఫేమ్ అజ్మల్ నటిస్తున్నాడు. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించబోతున్నది.ఈ సినిమాలను రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నారు.రీసెంట్ గా వ్యూహం సినిమా నుంచి విడుదల అయినరెండు టీజర్ లు ఎంతో ఆసక్తిని కలిగించాయి. మరి సినిమా విడుదల అయిన తరువాత ఎలాంటి కాంట్రవర్సీ సృష్టిస్తుందో చూడాలి..
Also Read
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
- Tags
- #shapadham
- RGV
- vyuham
తాజావార్తలు
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్‌ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..