RGV: ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి.. ఆర్జీవీ రచ్చ మాత్రం కచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ కు సపోర్ట్ గా మొదటి నుంచి బయోపిక్ లు తీస్తూ నగ్న సత్యాలు చెప్తూ వస్తున్నాడు. ఇక ఈసారి వ్యూహంతో రానున్నాడు. ప్రస్తుత ఏపీ రాజకీయాలను వేడెక్కించే విధంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ఎన్నో వివాదాలకు దారితీశాయి. ఇక వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని, విడుదలకు అనుమతి ఇవ్వకూడదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఇక ఈ తీర్పును సవాలు చేస్తూ.. వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా వాయిదా వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. జనవరి 8న వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత రికార్డులను సెన్సార్ బోర్డ్ న్యాయస్థానానికి అందజేసింది. ఇలా ఈ సినిమా కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉంది. దీనివలన వ్యూహం.. రిలీజ్ డేట్ కోసం కష్టాలు పడుతూనే ఉంది. ఎట్టకేలకు వర్మ ఆ సమస్యల నుంచి బయటపడి కొత్త రిలీజ్ డేట్ తో వచ్చేశాడు. ఫిబ్రవరి 23 న వ్యూహం రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. అది కూడా ఒక అమ్మాయిని గట్టిగా పట్టుకొని సిగరెట్ తాగుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్.. ఫిబ్రవరి 23 న వ్యూహం రిలీజ్ అవుతుంది అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్స్.. వ్యూహం రిలీజ్ డేట్ ఓకే.. ఆ అమ్మాయి ఎవరో కూడా చెప్తే.. బ్రేక్ ఇస్తామని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో వర్మ ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తాడో చూడాలి.
VYOOHAM film coming to theatres near @naralokesh , @ncbn and @pawankalyan on FEB 23 rd 🔥💃💪 pic.twitter.com/AAnHEgVJOz
— Ram Gopal Varma (@RGVzoomin) February 8, 2024
