Site icon NTV Telugu

Maa Ishtam : ప్రమోషన్స్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ని వాడేస్తున్న ఆర్జీవీ

RGV

పబ్లిసిటీ కోసం సినిమాలను, మనుషులను ఉపయోగించుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా. ఈ శుక్ర‌వారం విడుద‌ల కానున్న త‌న కొత్త సినిమా “మా ఇష్టం” విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నాడు వర్మ. వర్మ రూపొందించిన “డేంజరస్” ఏప్రిల్ 8న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. “డేంజరస్” క్రైమ్ థ్రిల్లర్-డ్రామా. ఖత్రా అనేది సెక్షన్ 377 రద్దు తర్వాత ఇద్దరు మహిళల మధ్య సాగే ప్రేమకథ. ఇక ఈ మూవీ తెలుగులో “మా ఇష్టం” , హిందీలో “ఖత్రా” పేరుతో విడుదలకు రెడీగా ఉంది. ఈ చిత్రంలో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి A సర్టిఫికేట్ ను జారీ చేసింది.

Read Also : Upendra: చిరంజీవి ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది.. కానీ

అయితే ఇప్పుడు వర్మ తన సినిమా ప్రమోషన్ల కోసం ‘ఆర్ఆర్ఆర్’ మేనియాని వాడేసుకుంటున్నాడు. RRR ప్రమోషన్స్ లో ఎన్టీఆర్, చరణ్ మధ్య జరిగిన సరదా మూమెంట్స్ అన్నీ ఒక దగ్గర చేర్చిన వీడియోకు ఆ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ మ్యూజిక్ ను యాడ్ చేసి, దానికి “డేంజరస్ 2.0 మా ఇష్టం” అనే ట్యాగ్‌లైన్‌ జత చేసి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఇక ఆర్జీవీ పోస్ట్ వైరల్ అయ్యిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Exit mobile version