RGV : ఆర్జీవీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో బూతులు, సెన్సార్ బోర్డు నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. తాజాగా ఆయన ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు. ‘సినిమాల్లో బూతులు ఉండొద్దని చాలా మంది వాదిస్తున్నారు. పైగా సెన్సార్ బోర్డు అయితే చాలా రూల్స్ పెట్టేస్తోంది. అక్కడికేదో సినిమాలో మాత్రమే ఇదంతా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తున్నారు.
Read Also : Lightning: ప్రాణాలు తీస్తున్న పిడుగులు.. ఏపీలో ఐదేళ్లలో 570 మంది మృతి
మోస్ట్ వైలెన్స్ కూడా మనకు ఫోన్ లో దొరుకుతోంది. అలాంటప్పుడు ఎంటర్ టైన్ మెంట్ కోసం తీసే సినిమాలో ఇది ఉండొద్దు.. అది మాట్లాడొద్దు.. ఇది చూపించొద్దు అంటే ఎలా. ఫోన్ లో చూస్తే తప్పు లేనప్పుడు సినిమాలో బిగ్ స్క్రీన్ పై బూతులు చూస్తే తప్పేంటి. అలా వద్దనడం నిజంగా అర్థం లేని పని. సెన్సార్ బోర్డ్ అనేది ఎప్పుడో ఎక్స్ పైర్ అయిపోయింది. అదొక్ స్టుపిడ్ థింగ్’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆర్జీవీ.
ఆర్జీవీ ఎప్పటికప్పుడు తన వాయిస్ వినిపిస్తూనే ఉంటారు. ఎన్నో విషయాలపై ముక్కుసూటిగా మాట్లాడేయడం ఆయనకు అలవాటే. వివాదాలు రేపే ఇలాంటి కామెంట్లు చేయడం ఆర్జీవీకి ఇదేం కొత్త కాదు. కానీ ఇప్పుడు ఏకంగా సెన్సార్ బోర్డునే తప్పుబట్టేశారు. మరి ఆయన కామెంట్లపై సెన్సార్ బోర్డు ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.
Read Also : Mega157 Shooting : సైలెంటుగా మొదలెట్టేశారు!
