NTV Telugu Site icon

RGV: ఫలితాల తరువాత మీడియా ముందుకు వర్మ.. జ్ఞానోదయం అయినట్టుందే!

Rgv

Rgv

RGV Says he wont do any Political Films in Future: వివాదం, రామ్ గోపాల్ వర్మ అనేవి రెండు పదాలు కాదు రెండూ ఒకటే అనేంతలా రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఒకానొక సమయంలో శివ లాంటి సినిమా చేసి ఇండస్ట్రీ మొత్తానికి ట్రెండ్ సెట్టర్ అయిన ఆయన పొలిటికల్ రొచ్చులో పడి ఒక పార్టీకి పని చేస్తున్నాడనే పేరు కూడా తెచ్చుకున్నాడు. తనకు జగన్ అంటే ఇష్టం అని చెబుతూ వన్ సైడెడ్ గా ఆయనకు మద్దతుగా సినిమాలు చేస్తూ వచ్చిన వర్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయాను అంటున్నారు. తాను ఇక పొలిటికల్ సినిమాలు కానీ బయోపిక్స్ కానీ చేయను అని ఇప్పటికే రాంగోపాల్ వర్మ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈరోజు తాను ఆ మధ్య టాలెంట్ హంట్ పెట్టి ఫిల్టర్ చేసిన దర్శకులను పరిచయం చేసేందుకు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఆ ప్రెస్ మీట్ తరువాత మీడియాతో కాసేపు ముచ్చటించాడు. ఈ నేపథ్యంలోనే ఒక జర్నలిస్ట్ మీరు గతంలో చేసినట్టుగానే పొలిటికల్ సినిమాలు అలాగే బయోపిక్స్ మళ్ళీ చేస్తారా అని అడిగితే తాను ఇక వాటి జోలికి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు.

Kannappa: ‘కన్నప్ప’ టీజర్ వచ్చేసింది.. ఆ నరుకుడేంది సామి..

గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి వారిని టార్గెట్ చేస్తూ సినిమాలు చేశారు. మరి ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా. ఇప్పుడు రివర్స్ లో జగన్ ను టార్గెట్ చేస్తూ సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే అసలు తాను ఇలాంటి సినిమాల జోలికి వెళ్ళనని ఇప్పటికే ప్రకటించానని అన్నారు. మీరు అడుగుతున్న ప్రశ్న నాకు ఎదురవుతుందని ఊహించాను అంటూ రాంగోపాల్ వర్మ తోసిపుచ్చారు. వర్మ చేసిన కామెంట్ల మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. రాంగోపాల్ వర్మకి ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి మద్దతుగా సినిమా చేస్తే తర్వాత వారికి అధికారం పోతే అప్పుడు అయినా ఇబ్బంది పడాల్సిందే కదా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మీరేమంటారు?