రామ్ గోపాల్ వర్మ..ఈ పేరు తెలియని వారు ఈ రెండు తెలుగు రాష్టాలలో ఎవరూ లేరు. ఆయన ఏది చేసినా కొత్తగానే ఉంటుంది.ఎవరికీ భయపడకుండా తనకు అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు ఆయనకి ఎలాంటి భావోద్వేగాలు ఉండవని అందరూ కూడా అంటుంటారు. చావు, పుట్టుక వంటి విషయాలపై తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు.ఆయనకు అస్సలు చావు అంటే ఇష్టం ఉండదని ఎవరైనా చనిపోతే అలా ఏడ్వడం కూడా నచ్చదంటూ కామెంట్ చేశారు.”నా కాలేజ్ ఫ్రెండ్ లో ఒకతని తల్లి రీసెంట్ గా చనిపోయింది. అప్పుడు అతడు నాకొక మేసేజ్ పెట్టాడు. కానీ నేను దానికి అస్సలు రిప్లై ఇవ్వలేదు. ఓ పది రోజుల తర్వాత మళ్లీ అతను మెసేజ్ చేశాడు. తన తల్లి పోయిందని చెప్పినా కూడా మెసేజ్ కు రిప్లై ఇవ్వలేదనీ ఫీలయ్యాడు.
అప్పుడు అతనికి ఇలా చెప్పాను.నాకు డెత్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. డెత్ అనే మాటకు నేనెప్పుడూ రియాక్ట్ కాను. మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఇంటికి చుట్టాలొచ్చి ఏడ్వడం వంటివి చూడడం ఇష్టం లేదని మా అమ్మ తో నేను చెప్పాను. ఇంట్లో మా నాన్న ఫొటో కూడా ఎక్కడ పెట్టవద్దని చెప్పాను. ఎందుకంటే ఆ ఫొటో ను నేను చూసినప్పుడల్లా మా నాన్న గారు లేరనే విషయం నాకు గుర్తొస్తుంది. అలా గుర్తు చేసుకుని, బాధపడడం నాకు ఇష్టం ఉండదు అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.నేను ఎలాంటి ఎమోషన్స్ తో పని లేనీ యోగినే కానీ యోగి అంటే గడ్డం, మీసం వంటివి ఉంటాయి. కానీ నాకు అలాంటివి ఏమి ఉండవు. నేనొక మోడ్రన్ యోగిని అని ఒక్క మాట లో చెప్పాలంటే నేనొక రొమాంటిక్ యోగిని ఆయన చెప్పుకొచ్చారు..నాకు మీసం ఉంటుంది. మీసం లేకపోతే నేను అస్సలు బాగోను అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు.
