NTV Telugu Site icon

Vidyut Jammwal: అడవుల్లో నగ్నంగా స్టార్ హీరో.. వర్మ సంచలన వ్యాఖ్యలు

Rgv Comments On Vidyut Jammwal

Rgv Comments On Vidyut Jammwal

RGV Comments on Vidyut Jammwal Nude Photos: బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ న్యూడ్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఈసారి విద్యుత్ కొన్ని నగ్న చిత్రాలను పంచుకున్నారు. ఆ ఫొటోలు చూసిన వారంతా రణవీర్ సింగ్ , రణబీర్ యానిమల్‌ సినిమాని గుర్తు చేసుకుంటున్నారు. 2022 సంవత్సరంలో రణవీర్ సింగ్ నగ్న ఫోటో షూట్ చేసారని మీకు గుర్తుండే ఉంటుంది, దాని గురించి చాలా వివాదాలు కూడా అలుముకున్నాయి. ఇటీవల యానిమల్ సినిమాలోని ఓ సన్నివేశంలో రణబీర్ కపూర్ బట్టలు లేకుండా కనిపించాడు, ఇప్పుడు విద్యుత్ జమ్వాల్ కూడా అలాంటిదే చేశాడు. ఆదివారం ఉదయం నటుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో నగ్న ఫోటోలను పంచుకున్నాడు. అవే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ జమ్వాల్ ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నాడు. అతను మూడు ఫోటోలను షేర్ చేసి నా రిటర్న్ టు ది హిమాలయన్ శ్రేణులు – “దేవుని నివాసం” అనే క్యాప్షన్‌ రాశాడు.

Bandla Ganesh: రేవంత్ రెడ్డిని చూస్తుంటే నాకు ఆ ‘సినిమా’ గుర్తొస్తోంది!

14 సంవత్సరాల క్రితం నుంచి ప్రతి సంవత్సరం 7-10 రోజులు ఒంటరిగా గడపడం నా జీవితంలో అంతర్భాగంగా మారింది. అడవికి వస్తున్నప్పుడు, నా ఏకాంతాన్ని కనుగొనడం, నేను ఎవరు అని తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం, ఇది “నేను ఎవరు” అని తెలుసుకోవడంతోపాటు శాంతితో నన్ను రక్షించుకోవడానికి మొదటి అడుగు, నేను నా కంఫర్ట్ జోన్ వెలుపల చాలా సౌకర్యంగా ఉన్నాను. నేను ప్రకృతి సహజ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఉన్నాను, నన్ను నేను శాటిలైట్ డిష్ యాంటెన్నాగా ఊహించుకుంటాను, ఇక్కడే నేను నన్ను చుట్టుముట్టి ఇంటికి రావాలనుకునే శక్తిని ఉత్పత్తి చేస్తాను. నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక ఈ ఫొటోలతో పాటు తన కొత్త సినిమాను కూడా ప్రకటించాడు. ఇప్పుడు నేను నా తదుపరి అధ్యాయం – క్రాక్ కోసం సిద్ధంగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను, ఈ సినిమా ఫిబ్రవరి 23, 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ ఫోటోలను చూసిన రామ్ గోపాల్ వర్మ భలే టైంకి ఫోటోలు వదిలావ్, నీలోని యానిమల్ ను బయట పెట్టావ్, గ్రీక్ దేవుడిలా ఉన్నావ్-మిలియన్ శాల్యూట్స్ అని అంటూ రాసుకొచ్చాడు.

Show comments