NTV Telugu Site icon

సమంత, నాగచైతన్య మరోసారి పుట్టారు: ఆర్జీవీ

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్టు గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతుండగా.. ఎట్టకేలకు వీరిద్దరు స్పందించారు. విడాకులు తీసుకుంటున్నట్టు నాగచైతన్య, సమంత అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వీరి విడాకుల ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్న వేళా.. సమంత, నాగచైతన్య తమ డైవోర్స్ ను సెలెబ్రేట్ చేసుకోవాలంటూ కితమిచ్చాడు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.

‘పెళ్లి అనే వాటిని మనం సెలెబ్రేట్ చేసుకోవద్దు.. పెళ్లంటే మంట.. అంటూ ఆర్జీవీ తన స్టైల్లో పోస్ట్ చేశారు. పెళ్లంటే చావు.. విడాకులు అంటూ మళ్లీ జన్మ రావడం అంటూ చెప్పేశాడు. అంటే సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై ఆర్జీవీ ఇలా పరోక్షంగా స్పందిస్తూ.. విడాకులు మంచివే’ అన్నట్టుగా స్పందించాడు. అంతేకాదు.. విడాకులపై తన గత ఫుల్ ఇంటర్వ్యూ వీడియోను ఆర్జీవీ షేర్ చేశారు.

ఇక ఎన్నో చర్చలు తరువాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని సమంత, నాగ చైతన్య ప్రకటించారు. భార్యాభర్తలుగా విడిపోయినా కూడా స్నేహితుల్లా కలిసి ఉంటామని అన్నారు. తమ మధ్య ఉన్న స్నేహబంధం ఎప్పటికీ ఇలానే ఉంటుందని పేర్కొన్నారు.