Site icon NTV Telugu

ఆర్జీవీ చెంప పగలగొట్టిన అషు రెడ్డి

వివాదాస్పద ఇంటర్వ్యూలతో వార్తల్లో నిలుస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ‘బోల్డ్ ఇంటర్వ్యూ’ చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న అరియానాతో జిమ్ లో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన వర్మ.. తాజాగా అషు రెడ్డితో చేసిన ఇంటర్వ్యూ ప్రోమోను విడుదల చేశారు. ఓ కాఫీ షాప్ లో ఉన్న అషురెడ్డి దగ్గరకు వర్మ వెళ్లారు. ఆయనే స్వయంగా పరిచయం చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నించాడు. అషురెడ్డి ఆయనెవరో తెలియదన్నట్లుగా ప్రవర్తించింది. నేను రామ్ గోపాల్ వర్మను అని ఆయన పరిచయం చేసుకున్న కూడా.. అషు రెడ్డి ‘సో.. వాట్’ అంటూ గంభీరమైన సమాధానం ఇచ్చింది. ఆతరువాత రాము ఆమె కాళ్ల వైపు చూస్తూ బోల్డ్ కామెంట్స్ చేశారు. అది విన్న అషురెడ్డి.. ఆర్జీవీ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఈ ప్రోమో ఆయన అభిమానులను ఆకట్టుకోంటుంది.

Exit mobile version