Site icon NTV Telugu

RGV : కన్నడ స్టార్ తో ప్రయత్నం ఫలించేనా ?

Rgv

RGV మరో కొత్త సినిమాను ప్రయత్నించారు. నాగార్జునతో ‘ఆఫీసర్’ తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాలకు స్టార్ పవర్, కంటెంట్ కొరవడిందనే చెప్పాలి. ప్రేక్షకులు, విమర్శకులు పెద్దగా ఆదరించని ఓ మోస్తరు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు అభిమానులు ఆశిస్తున్నట్టుగా RGV ఎట్టకేలకు ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఓ కన్నడ స్టార్ ను హీరోగా ఎంచుకున్నాడు. తన సినిమాని ప్రకటిస్తూ RGV టైటిల్‌ను వెల్లడించాడు. ‘R’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటిస్తుండగా, సినిమాకు సంబంధించి రెండు గ్లింప్స్ లను రిలీజ్ చేశారు వర్మ.

Read Also : RRR : స్పెషల్ షో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్

బెంగళూరు నగరాన్ని మాత్రమే కాకుండా ముంబైలోని మాఫియాను, దుబాయ్‌లోని డి కంపెనీని కూడా భయపెట్టే భయంకరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో భారతదేశ నేర చరిత్రలో ఒక డేర్‌డెవిల్, అత్యంత సక్సెస్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ అని అన్నారు. మరి RGV ‘R’తో బౌన్స్ బ్యాక్ అవుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ సినిమాతోనైనా ఆర్జీవీ తన అభిమానులు కోరుకుంటున్న కంటెంట్ ను అందించి, ఆర్జీవీ ఈజ్ బ్యాక్ అన్పిస్తాడేమో చూడాలి.

Exit mobile version