Site icon NTV Telugu

Revathi: పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశా.. నటి షాకింగ్ కామెంట్స్!

Revathi Shocking Comments on Marriage: తెలుగువారిని తనదైన అభినయంతో అలరించిన రేవతి ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలతో పరవశింప చేస్తున్నారు. రేవతి అసలు పేరు ఆశా కేలున్ని, కొచ్చిలో 1966 జూలై 8న జన్మించారామె. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘మణ్ వాసనై’ తమిళ చిత్రం ద్వారా రేవతి తొలిసారి నటిగా గుర్తింపు సంపాదించారు. అనతికాలంలోనే మాతృభాష మళయాళంతో పాటు, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించేసి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు రేవతి. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ‘మానసవీణ’ చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టారు రేవతి. రామ్ గోపాల్ వర్మ ‘గాయం’లోనూ రేవతి తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు
తన వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తున్నారు రేవతి. “అనుక్షణం, లోఫర్, సైజ్ జీరో, బ్రహ్మోత్సవం, యుద్ధం శరణం, ఇట్లు అమ్మ, మేజర్” వంటి చిత్రాలలో కనిపించి అలరించారు రేవతి.కేవలం నటిగానే కాదు, దర్శకురాలిగానూ రేవతి తనదైన బాణీ పలికించారు.

MP CM RAMESH: “రుషికొండ విషయంలో కోర్టులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తప్పవు”

రేవతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన సినీ ప్రయాణం గురించి, పెళ్లి గురించి ఓపెన్ గా కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ 17 సంవత్సరాల వయస్సులో నటించడం ప్రారంభించా, మూడేళ్లు నటించిన తరువాత 20 సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసుకున్నాను. పెళ్లయ్యాక ఏడాది పాటు నటించకపోయినా ఆ తరువాత ఇష్కీ వాసల్ , దేవర మగన్ వంటి మంచి సినిమాలు చేశానన్నారు. పెళ్లి తరువాత చాలా సినిమాలు చేయలేకపోయా, అప్పుడే పెళ్లి చేసుకుని తప్పు చేశానని అనిపించింది. కెరీర్ ను ఇంకాస్త చూసుకుని… ఆ తరువాత చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఎన్నో మంచి చిత్రాలు చేసి పెళ్ళి చేసుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తోంది అన్నారు రేవతి.

Exit mobile version