Renu Desai Strong counter to Netizen who called her Unlucky: పవన్ కళ్యాణ్ తో విడాకుల గురించి రేణూ దేశాయ్ ఇప్పటికే చాలా సార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు. అయినప్పటికీ కొంతమంది ఆమెను సోషల్ మీడియాలో బాధపెట్టేలా కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా రేణూ దేశాయ్ చూసిచూడనట్లు వదిలేయకుండా రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓ నెటిజన్ రేణూ దేశాయ్‌ని మీరు అన్‌లక్కీ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఆమె ఆ కామెంట్‌కి హర్ట్ అయ్యారు. స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. “నేను ఎలా అన్‌లక్కీ అనేది ఒకసారి చెబుతారా? మీ సమాధానం కోసం ఎదుచూస్తున్నా” అంటూ రేణూ దేశాయ్ రిప్లయ్ ఇవ్వడం మాత్రమే కాదు ఈ కామెంట్లను స్క్రీన్ షాట్ తీసి మరో పోస్ట్ కూడా పెట్టారు. “నా భర్త నన్ను వదిలేసి, వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నన్ను అన్‌లక్కీ అంటూ కొంతమంది సంవత్సరాలుగా చేస్తున్న కామెంట్లు వినీవినీ నాకు బాధగా ఉంది, అలానే విసుగొచ్చింది.
Isha Koppikar: ఆ హీరో ఒంటరిగా రమ్మన్నాడు.. సంచలన విషయాలు బయట పెట్టిన హీరోయిన్
నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు మీరు ముడి పెడుతున్నారు అని ఆమె ప్రశ్నించారు. నాకు జీవితంలో దక్కిన ప్రతి విషయానికి నేను చాలా కృతజ్ఞురాలిని అని పేర్కొన్న ఆమె లేని దాని గురించి నాకు ఏ బాధ లేదు, కనుక విడాకులు తీసుకున్న ఏ మహిళా, పురుషుడు కూడా వాళ్ల పెళ్లి వర్కవుట్ అవనంత మాత్రాన దురదృష్టవంతులు కాదని తెలుసుకుంటే చాలని ఆమె అన్నారు. “మనం 2024లో ఉన్నాం, ఒక వ్యక్తి అదృష్టాన్ని తన విడాకుల వలన విడిపోయిన లేదా చనిపోయిన భాగస్వామితోనే ముడిపెట్టడం ఇకనైనా ఆపండి, ఇప్పటికైనా సమాజం మారాలి. విడాకులు తీసుకున్న వ్యక్తిని ఓ మనిషిగా చూడండి.. వారివారి టాలెంట్, కృషి ఆధారంగా మాత్రమే గుర్తింపు ఇవ్వండి. ఒకప్పటి ఆలోచనల్ని పక్కన పెట్టి మైండ్ సెట్ మార్చుకోండి.” అంటూ రేణూ దేశాయ్ ఘాటుగా స్పందించారు.