Site icon NTV Telugu

Renu Desai : ఆయన పిలిస్తే కచ్చితంగా వెళ్తా – రేణు దేశాయ్..

Renu Desai

Renu Desai

సినిమాల్లో నటించినా, నటించకున్నా– సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ సంపాదించుకుంది రేణు దేశాయ్. తనదైన ఆలోచనలతో, లైఫ్‌స్టైల్‌తో ఎప్పుడూ చర్చల్లో నిలుస్తూనే ఉంటారు. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లోనే 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం ఆమె పాపులారిటీకే నిదర్శనం. తాజాగా ఆమె షేర్ చేసిన ఒక ఆధ్యాత్మిక పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

Also Read : Sreeleela : అదే హీరోతో మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన శ్రీలీల..?

ఆధ్యాత్మికతపై రేణుకి చిన్నప్పటి నుంచే ఆసక్తి. ఇంట్లో పండుగలు, సంప్రదాయాలు, ఆచారాలు చాలా శ్రద్ధగా పాటిస్తూ, పిల్లలకు కూడా వాటి విలువలు నేర్పుతూ ఉంటుంది. అంతేకాదు తరచు దేశంలోని అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించే రేణు, భవిష్యత్తులో సన్యాసం తీసుకోవచ్చని గతంలో చెప్పడమే అభిమానుల్లో పెద్ద ఆసక్తి రేకెత్తించింది. ఇక తాజాగా కాల భైరవ జయంతి సందర్భంగా కాశీకి వెళ్లిన రేణు తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “కాల భైరవ జయంతి రోజున మనం రక్షణ కోరకూడదు. మనమే రక్షకులుగా మారాలి. ఆ పరమేశ్వరుడు పిలుస్తే, మనం అన్ని వదిలేసి కాశీకి వెళ్లాలి’ అని ఆమె పోస్ట్ చేసింది. ఈ మాటలు చూసిన అభిమానులు ఆమె గతంలో చేసిన సన్యాస వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ చర్చలు జరుపుతున్నారు. ప్రజంట్ ఈ టాపిక్ మరోసారి వైరల్ అవుతుంది.

Exit mobile version