కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్‌ను పలకరించి ఏడాది దాటిపోయింది. 2024 మొత్తం షూటింగ్స్ తోనే గడిపేశాడు. విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఈ ఏడాది సంక్రాంతికి విదాముయర్చిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఉన్నట్టుండి అనివార్య కారణాల వలన ఈ సినిమా పొంగల్ రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. విదాముయర్చి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడడంతో రిలీజ్ కు బ్రేక్ పడింది.
మజీజ్ తిరుమనేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా దీపావళికే సినిమా రిలీజ్ చేయాలనుకుంటే షూటింగ్ చివరి దశలో ఉండటం, పోస్టు ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉండటంతో సంకాంత్రికి అక్కడి నుండి జనవరి చివరి వారానికి పోస్టు పోన్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ కు విపరీతమైన స్పందన లభించగా తాజగా విదాముయర్చి ట్రైలర్ ను నేడు విడుదల చచేయనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. మరోవైపు ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి వారం లేదా జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల దుబాయ్ లో జరిగిన 24H రేసింగ్ లో మెడల్ సాధించిన అజిత్ తాను నటించిన సినిమా ఈ జనవరి లో విడుదల కానుందని ప్రకటించాడు. దీంతో విదాముయర్చి జనవరి 26న రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ నెలలోనే రిలీజ్ చేస్తారో లేదా ఫిబ్రవరికి మరోసారి పోస్ట్ పోన్ చేస్తారో నేడు రిలీజ్ కానున్న ట్రైలర్ లో ప్రకటిస్తారేమో చూడాలి.