యంగ్ హీరో సత్యదేవ్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. తెలుగుతో పాటు హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘రామ్ సేతు’ మూవీలోనూ సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే గతంలో సత్యదేవ్, గోపీ గణేశ్ కాంబినేషన్ లో ‘బ్లఫ్ మాస్టర్’ మూవీ వచ్చింది. మళ్ళీ ఇంతకాలం తర్వాత వారి కాంబో రిపీట్ అవుతోంది. సత్యదేవ్, గోపీ గణేశ్ తో సి. కళ్యాణ్ ‘గాడ్సే’ పేరుతో సినిమా తీస్తున్నారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీతో తమిళ నటి ఐశ్వర్య లక్ష్మి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటివరకూ చేయని భిన్న తరహా పాత్రలో సత్యదేవ్ నటిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి కూడా పెర్‌ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ చేస్తోందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. నాగబాబు, నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, కిశోర్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ‘గాడ్సే’ సినిమాను మే 20న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించాడు.
Satya Dev : రిలీజ్ డేట్ లాక్ చేసిన ‘గాడ్సే’

Godse