Rekha boj announces streaking at vizag beach if India wins World Cup 2023: ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్ సెమీ ఫైనల్స్ కి చేరుకోగా ఈరోజు సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో గెలిచి ఇండియా వరల్డ్ కప్ కొడుతుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలుతుంది. అయితే ఈరోజు సెమీస్ గెలిచి ఇండియా వరల్డ్ కప్ కొడితే.. వైజాగ్ బీచ్ లో నగ్నంగా నడుస్తా అంటూ ఓ తెలుగు హీరోయిన్ ఓపెన్ ఛాలెంజ్ చేసింది. అను నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండే తెలుగు హీరోయిన్ రేఖా బోజ్ మాంగల్యం, స్వాతి చినుకు సంధ్య వేళలో, రంగీలా, కలయా తస్మై నమా: అనే సినిమాల్లో నటించింది. అయితే ఈ ప్రాజెక్ట్ లు ఏమీ ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. తెలుగులో తెలుగు అమ్మాయిలను తీసుకోవడం లేదు అంటూ విమర్శలు గుప్పిస్తూ ఉండే ఆమె టాలీవుడ్ లో ఎన్నో సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం మాత్రం దక్కలేదు.
Kanguva: ఆరు ఫైట్స్… అందులో ఒకటి అండర్ వాటర్ ఎపిసోడ్
ఈ క్రమంలో సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో ఉండే ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ భామ వరల్డ్ కప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఇండియా వరల్డ్ కప్ కొడితే వైజాగ్ బీచ్ నగ్నంగా కనిపిస్తా అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా కాగా ఆమె తన ఫేస్ బుక్ వేదికగా ఈ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టుకు నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. అవసరం అంటావా ఇలాంటి వాటికి కమిట్ అవ్వకండి అంటూ సలహాలు కొందరు ఇస్తుంటే గెలిచేది మనమే కానీ ఇప్పుడు వెంటనే వైజాగ్ రావాలంటే కష్టం కదా అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఫేమస్ అయ్యేందుకు ఇలా డ్రామాలు ఆడుతోందని అని కొంత మంది కామెంట్ చేయగా డేట్ చెప్తే వచ్చి కూర్చుంటా అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.