NTV Telugu Site icon

‘పుష్ప’ స్టైల్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్… కానీ ఫ్లవర్ అయ్యాడుగా !

Smuggling

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. హిందీలో సంచలనం సృష్టించి వార్తల్లో నిలిచిన ‘పుష్ప’రాజ్ తాజాగా గరికపాటి వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ సినిమా వల్ల నేరాలు పెరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గరికపాటి. అయితే తాజాగా సినీ ఫక్కీలో ఓ యువకుడు స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోగా… ఆ పిక్ ని షేర్ చేస్తూ గరికపాటి అభిమానులు పుష్ప ఎఫెక్ట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడిన వ్యక్తి సినీ ఫక్కీలో ఆ పనిని చేయడం గమనార్హం. ఒక కూరగాయల ట్రక్కులో రూ. 2.25 కోట్ల విలువైన ఎర్రచందనం దొంగలను లోడ్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకు దొరికిపోయాడు. కర్ణాటక బోర్డర్ క్రాస్ చేసి వెళ్తున్న సదరు నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు సంగ్లీ అని ఏరియాలో అరెస్ట్ చేశారు.

Read Also : కొత్త ఇంట్లోకి రష్మిక… ఎప్పుడు మారుతోందంటే?

అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ‘పుష్ప’ సినిమాతో పోలుస్తున్నారు గరికపాటి అభిమానులు. అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. ఈ సినిమాను చూసి స్మగ్లింగ్ చేస్తున్నారు అనడం కరెక్ట్ కాదని, ఎన్నో ఏళ్ల నుంచి ఆ తరహా స్మగ్లింగ్ అనేది జరుగుతోందని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి గరికపాటి వ్యాఖ్యలతో మరోసారి ‘పుష్ప’రాజ్ గురించి టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.