Site icon NTV Telugu

Record Break Movie: ఆకట్టుకునేలా మళ్లీ పుట్టి వచ్చినవా సాంగ్

Malli Putti Vachhhinava

Malli Putti Vachhhinava

Record Break Movie second single Released: చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తూ నిర్మించిన సినిమా రికార్డు బ్రేక్. ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రంగా మేకర్స్ ప్రచారం చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఘనంగా విడుదల చేయగా ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మళ్లీ పుట్టి వచ్చినవా అని సాగే ఈ పాటకి సాబు వర్గీస్ మ్యూజిక్ అందించగా వరికుప్పల యాదగిరి రచయితగా, గాయకుడిగా వ్యవహరించారు. ఇక ఈ ఈ పాట సినిమాకి పెద్ద అసెట్ గా నిలుస్తుందని అంటున్నారు. చదలవాడ శ్రీనివాస్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా 8 భాషల్లో ఈ సినిమాను తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు నడుస్తున్నాయి.

Rana Daggubati: క్రేజీ బయోపిక్ లో రానా?

ఇక ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకులు ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ మా సినిమా రికార్డ్ బ్రేక్ నుంచి సెకండ్ సాంగ్ గా మళ్లీ పుట్టి వచ్చినవా సాంగ్ విడుదల చేసాము, ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ కి మంచి స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించడం జరిగింది, ఈ సినిమా చిత్రీకరణ సమయంలో మా ఆర్టిస్టులు టెక్నీషియన్లు రాత్రానక పగలనకా ఎండనక వాననక చాలా సపోర్ట్ ఇచ్చారని అన్నారు. అతి త్వరలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నామని అన్నారు. ప్రేక్షకులందరికీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు. నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ , సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version