December Clash : డిసెంబర్ రేస్‌లో రెబల్ స్టార్ vs కింగ్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్, బాలీవుడ్‌కు సమ్మర్ కన్నా హాట్ సీజన్‌గా మారింది క్రిస్మస్ మంత్. ముఖ్యంగా థౌజండ్ మార్క్ చిత్రాలను అందిస్తోంది ఈ స్లాట్. 2023 డిసెంబర్లో సందీప్ రెడ్డి వంగా ఫిల్మ్ యానిమల్ రూ. 920 కోట్లు వసూలు చేసి రణబీర్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అలాగే అదే నెలలో రిలీజైన శ్యామ్ బహుదూర్, హాయ్ నాన్న, సలార్, డంకీ చిత్రాల కలెక్షన్స్ బీట్ చేసి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కానీ సలార్ వర్సెస్ డంకీ ఫైట్‌గానే గుర్తుంచుకున్నారు ఆడియన్స్.
2025 చివరిలో వచ్చిన ధురంధర్ ర్యాంపేజ్ హోల్ ఇండియా చూసింది. డిసెంబర్ 5న రిలీజైన స్పై థ్రిల్లర్ స్లో పాయిజన్‌లా మొదలై.. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది. రణవీర్ ఫెర్ఫామెన్స్ అండ్ ఆదిత్యధర్ టేకింగ్ అండ్ మేకింగ్‌కు ఫిదా అయిన ఆడియన్స్ కోట్లు కుమ్మరించారు. దీని దెబ్బకు అఖండ2 నిలబడలేకపోయింది. వృషభ ఎంత ఫాస్ట్‌గా వచ్చిందో అంత త్వరగా వెళ్లిపోయింది. ఈ త్రీ ఇయర్స్ డిసెంబర్ లెక్కలు చూస్తే బాలీవుడ్ ఓ మెట్టు ఎక్కువలో కనిపిస్తోంది. ఇక ఈ ఇయర్ డిసెంబర్ లెక్కలు తేలాల్సి ఉంది. ఈ ఇయర్ ఎండింగ్ బరిలో కూడా బోలెడు సినిమాలు వస్తున్నాయి. కానీ కింగ్ ఖాన్, రెబల్ స్టార్స్ మధ్యే పోటీ వాతావరణం కన్పిస్తోంది. ఈ ఇద్దరు సినిమాల మధ్య భారీ గ్యాప్ ఉన్నప్పటికీ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే మొనగాడు ఎవరన్నదీ క్యూరియస్ కలిగిస్తోంది. ఫౌజీ డిసెంబర్3న వస్తుంటే.. షారూఖ్ ఖాన్ కింగ్ డిసెంబర్ 24న సందడి చేయబోతుంది. మరీ బాద్ షా వర్సెస్ పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌లో ఈ డిసెంబర్‌ను రూల్ చేసేది ఎవరో..? లేదా మరొకరికి ఆ ఛాన్స్ ఇస్తారో? లెట్స్ వెయిట్.
Also Read
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి