Site icon NTV Telugu

Raviteja: టైగర్ రోర్ కి సిద్ధమవ్వండి…

Tiger

Tiger

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్న రవితేజ… ఈసారి బౌండరీలు దాటి నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియాకి గురి పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు రవితేజ. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ అభిషేక్ అగర్వాల్ టైగర్ నాగేశ్వర రావు సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్న మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచే పనిలో ఉన్నారు. ఇప్పటికే టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఐదు భాషల్లో ఐదుగురు స్టార్ హీరోలు రివీల్ చేయడమే కాకుండా ఫస్ట్ గ్లింప్స్ కు వాయిస్ కూడా అందించి, ప్రమోషన్స్ కి సాలిడ్ కిక్ ఇచ్చారు. టైటిల్ రివీల్ గ్లిమ్ప్స్ రవితేజ మాములుగా లేడు.

“జింకలను వేటాడిన పులిని చూసి ఉంటావ్. పులులను వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా..? ” అని రవితేజ పవర్ ఫుల్ వాయిస్ తో చెప్పే డైలాగ్ గ్లిమ్ప్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్ళింది. గ్లిమ్ప్స్ కే ఇలా ఉంటే టీజర్ బయటకి వస్తే ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. మచ్ అవైటెడ్ టీజర్ టైగర్ నాగేశ్వరరావు టీజర్ కి సంబంధించిన అప్డేట్ కి ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాలకి అనౌన్స్ చేస్తున్నట్లు మేకర్స్ ట్వీట్ చేసారు. “You’ve seen a glimpse into his world, it is now time to witness the TIGER’S ROAR” అంటూ మేకర్స్ టీజర్ రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ ని ఇచ్చారు. దాదాపు ఆగస్టు 15న టైగర్ నాగేశ్వరరావు టీజర్ బయటకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అది సినిమాపై ఎలాంటి హైప్ పెంచడానికి కారణం అవుతుంది అనేది చూడాలి.

Exit mobile version