మాస్ మహారాజా రవితేజ అస్సలు తగ్గేదెలా అన్నట్లు వరుస సినిమాలను లైన్లో పెట్టేసాడు. ఒకదాని తరువాత ఒకటి అధికారిక ప్రకటన చేసేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు సెట్స్ పై ఉండగా మరో రెండు సినిమాలను ప్రకటించేశాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ లో గజదొంగ నటిస్తున్నట్లు తెలిపిన రవితేజ.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ గా కనిపించడానికి సిద్దమైపోయాడు. ఇటీవలే ప్రీ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్ నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో రవితేజ దశముఖ రావణాసుర గా కనిపించాడు. భయంకరమైన బ్యాక్ గ్రౌండ్ లో రవితేజ ఒక లాయర్ లుక్ లో సీరియస్ గా చూస్తున్నాడు.. ఇక చుట్టూ ఉన్న తొమ్మిది ముఖాలు కూడా అదే ఇంటెన్సివ్ లుక్ తో కనిపించాయి. రక్తం, గన్స్, స్పెషల్ గా రవితేజ చేతిలో సుత్తి ఇవన్నీ చిత్రంపై భారీ అంచనాలను నెలకొనేలా చేస్తున్నాయి. స్వామిరారా చిత్రంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ల లిస్ట్ లోకి చేరిపోయిన సుధీర్ వర్మ ఆ తర్వాత కొన్ని ప్లాప్ లను చవిచూసి మరోసారి తన సత్తా నిరూపించుకోవడానికి రెడీ అయినట్లు పోస్టర్ చూస్తుంటేనే తెలుస్తోంది. రావణాసుర అంటేనే పదితలలు.. పది ముఖాలు.. మరి ఈ సినిమాలో రవితేజ కూడా పది వేరియేషన్స్ లో కనిపించనున్నాడని టాక్.. మరి ఈ సినిమా రవితేజకు మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఇవ్వనుందేమో చూడాలి.
