మాస్ మహారాజ టైం అయిపొయింది, ఆయనలో ఒకప్పటి జోష్ లేదు, రొటీన్ రొట్ట సినిమాలు చేస్తున్నాడు అనే విమర్శలకి ‘ధమాకా’ సినిమాతో సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు రవితేజ. రెగ్యులర్ టెంప్లెట్ కథలో రవితేజ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ని యాడ్ చేసి పర్ఫెక్ట్ కమర్షియల్ గా రూపొందిన ధమాకా సినిమా డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి వచ్చింది. రిలీజ్ కన్నా ముందు సాంగ్స్ తో హైప్ పెంచిన చిత్ర యూనిట్, మార్నింగ్ షో పడగానే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇంత యునానిమాస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు. దాదాపు రెండు వారాలుగా బాక్సాఫీస్ ర్యాంపేజ్ చూపిస్తున్న ధమాకా సినిమా వంద కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ మూవీ సెట్స్ పై ఉండగా అస్సలు అంచనాలు లేవు కానీ రిలీజ్ డేట్ టైంకి హట్ కల వచ్చేసింది. వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవ్వడంతో ధమాకా సినిమా ఇప్పటికీ స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తోంది.
మరో వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలు విడుదల అవ్వట్లేదు కాబట్టి ధమాకా ఖాతాలో మరికొన్ని కోట్లు వచ్చి చేరే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ధమాకా కలెక్షన్స్ సాలిడ్ గానే ఉన్నాయి. ఇప్పటివరకూ 600K డాలర్స్ రాబట్టిన ధమాకా సినిమా రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ ఓవర్సీస్ గ్రాసర్ గా నిలిచింది. భీమ్స్ మ్యూజిక్, హీరోయిన్ శ్రీలీలా గ్లామర్, రవితేజ ఎనర్జీ, హైపర్ ఆది కామెడీ ట్రాక్, ప్రసన్న రాసిన పంచ్ లైన్స్ ధమాకా సినిమాని వర్త్ వాచింగ్ అనిపించేలా చేశాయి. దీంతో రవితేజ పని అయిపొయింది అనే మాటకి ఎండ్ కార్డ్ పడినట్లు అయ్యింది. కథ సోసోగా ఉన్నా చాలు రవితేజ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాని లాభాల బాట పట్టిస్తాడు అనే నమ్మకం అందరిలోనూ కలిగించాడు. ఇదే సక్సస్ ట్రాక్ ని రవితేజ నెక్స్ట్ సినిమాలకి కూడా కంటిన్యు చెయ్యాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. రవితేజ నెక్స్ట్ లైనప్ లో ‘టైగర్ నాగేశ్వర్ రావు’, ‘రావణాసుర’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సినిమాలు ఉన్నాయి.
MassMaharaja @RaviTeja_offl 's
Bombarding 1️⃣0️⃣0️⃣ CR+..
Reverberating Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/Nb82bElsW1
— People Media Factory (@peoplemediafcy) January 6, 2023