NTV Telugu Site icon

Raviteja: నెగెటివిటీపై రవితేజ సంచలన కామెంట్స్.. ఏదో ఒక శుక్రవారం దొరికేస్తారు అంటూ!

Harish Shankar Raviteja

Harish Shankar Raviteja

Raviteja Comments on Negatitivity Goes Viral in Social Media: సంక్రాంతి సినిమాలు రిలీజ్ నేపథ్యంలో నెగిటివిటీ అనేది ఒక ట్రెండింగ్ హాట్ టాపిక్ అయిపోయింది. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా యూనిట్ అయితే తమ సినిమా మీద కావాలని నెగిటివ్ పెయిడ్ రివ్యూస్ వస్తున్నాయని చెబుతూ సైబర్ క్రైమ్ సంస్థను కూడా ఆశ్రయించడం హాట్ టాపిక్ అవుతుంది. ఇలాంటి సమయంలో రవితేజ వ్యాఖ్యలు చేశారంటూ నెగిటివిటీ గురించి హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. ఇక్కడ ఎవరికీ ఎవరి మీద నెగిటివిటీ ఉండదు ఒకవేళ ఉన్నా ఏదో ఒక శుక్రవారం ఎవరో ఒకరు దొరికేస్తారు, ఎవడన్నా, పక్కోడి అపజయానికి సోలో డాన్స్ ఏస్తే, రేపు వాడి, అపజయానికి గ్రూప్ డాన్సర్లు రెడీ అవుతారు అంటూ ఎంతో గొప్ప ఫిలాసఫీని రవితేజ చెప్పాడని అంటూ హరీష్ శంకర్ పేర్కొన్నారు.

Jayaram: మాష్టారూ.. మీరసలు పెళ్ళాంతో సరిగా కాపురం చేసే క్యారెక్టర్లు చేయరా?

హరీష్ శంకర్ చేసిన ట్వీట్ గురించి రవితేజ స్పందిస్తూ దీనికి నీ ఎక్స్టెన్షన్ పెట్టావ్ ఏంటి రా అంటూ ప్రశ్నించారు. ఇక ఆ ట్వీట్ కి హరీష్ శంకర్ స్పందిస్తూ మీకు అన్నీ గుర్తుంటాయి అన్నయ్య. యు ఆర్ రైట్, మారుతున్న ఆడియన్స్ టేస్ట్ కి సర్దుకుంటూ పోవడం లేదా మొత్తం సర్దేసుకొని వెళ్ళి పోవడం అదేనా ఎక్స్టెన్షన్ అంటూ హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఇక హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మూడో సినిమా కూడా తెరకెక్కుతోంది. హరీష్ శంకర్ ని దర్శకుడిని చేసింది రవితేజనే కాబట్టి వారిద్దరి మధ్య అనుబంధం వేరే లెవెల్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.