NTV Telugu Site icon

Raviteja: నిన్ను చూడగానే ఇంకొకడు వచ్చాడ్రా అనిపించింది, నువ్వు ఫెయిల్ అయితే ఇంటికే…

Raviteja

Raviteja

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోలు నాని, రవితేజ మాత్రమే. సెల్ఫ్ మెడ్ స్టార్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరూ కలిసి తమ సినిమాలని ప్రమోట్ చేస్తూ సినీ అభిమానులకి కిక్ ఇస్తున్నారు. నాని నటించిన ‘దసరా’, రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. దసరా మార్చ్ 30న, రావణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ అవుతుండడంతో నాని, రవితేజలు కలిసి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఎనర్జీకి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే నాని, రవితేజలు తమ సినీ జర్నీ గురించి మాట్లాడారు. ఈ సంధర్భంగా నాని గురించి రవితేజ మాట్లాడుతూ… “నీ సినిమాలు చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు ఇండస్ట్రీకి ఇంకొకడు వచ్చినట్లు అనిపించింది. బాపు గారి దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసి రావడం నీకు బాగా హెల్ప్ అయ్యింది. అష్టా చెమ్మ నుంచి నీ ప్రతి సినిమా చూసాను. రిజల్ట్ తేడా అయిన సినిమాలు ఉన్నాయేమో కానీ నాని బాగా చెయ్యలేదు అనే మాట ఇప్పటివరకూ రాలేదు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన మనలాంటి వాళ్లు ఫెయిల్ అయితే డైరెక్ట్ గా ఇంటికి వెళ్లిపోవాల్సిందే. ఆ భయం భాద్యత ఉంటుంది కాబట్టే మనం ఫెయిల్ అవ్వము” అని చెప్పాడు.

నా ఆటోగ్రాఫ్ లాంటి సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు ఆదరించి ఉంటే మరిన్ని మంచి సినిమాలు చేసి ఉండేవాడిని కానీ ఆడలేదని రవితేజ చెప్పినప్పుడు. విక్రమార్కుడు లాంటి మూవీ నాకు చెయ్యాలని ఉంటుంది కానీ నేను మీ అంత బాగా నటించలేను అని నాని, రవితేజకి కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇదే ఇంటర్వ్యూలో జెర్సీ, నేనింతే సినిమాలకి మధ్య ఉన్న సిమిలారిటీస్ ని, శ్యామ్ సింగ రాయ్-టైగర్ నాగేశ్వర రావు సినిమాల గురించి కూడా రవితేజ, నానిలు డిస్కస్ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోల ఇంటర్వ్యూ మ్యూచువల్ ఫాన్స్ కి ఒక గిఫ్ట్ లా మారింది. మరి సెల్ఫ్ మేడ్ స్టార్స్ అయిన రవితేజ, నానిలు దసరా, రావణాసుర సినిమాలతో ఎలాంటి హిట్స్ కొడతారో చూడాలి.

Show comments