Ravi Teja : ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే క్రాస్ సినిమాలు. అంటే యూనివర్స్ లు, క్రాస్ ఓవర్లు పెరుగుతున్నాయి. ఖైదీ సినిమాకు, విక్రమ్ సినిమాకు లింక్ పెట్టడంతో ప్రేక్షకులు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ఉన్న సినిమాలు టిల్లు స్వ్కేర్, మ్యాడ్ స్వ్కేర్. యూత్ ను ఓ రేంజ్ లో ఊపేశాయి ఈ సినిమాలు. ఈ రెండు సినిమాలను తీసింది కల్యాణ్ శంకర్. వీటి నిర్మాత నాగవంశీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవితేజను కళ్యాణ్ శంకర్.. టిల్లు స్వ్కేర్, మ్యాడ్ స్వ్కేర్ ను క్రాస్ ఓవర్ చేసి ఒక సినిమా తీస్తే మీరు నటిస్తారా అని అడిగాడు.
Read Also : Shilpa Shetty : రోజుకు రూ.2 కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్..
దానికి రవితేజ వెంటనే ఓకే చెప్పేశాడు. తప్పకుండా చేస్తాను. కథ రెడీ చేసుకో అన్నాడు. ఫహాద్ ఫాజిల్ తీసిన ఆవేశం సినిమా లాంటి పాత్రను పెడుదాం అన్నాడు కల్యాణ్. తప్పకుండా అలాంటి పాత్రనే చేస్తా అంటూ హామీ ఇచ్చాడు రవితేజ. దీనికి మాస్ మ్యాడ్ క్యూబ్ అని టైటిల్ కూడా సజెస్ట్ చేశాడు కళ్యాణ్ శంకర్. ఇది మాట వరసకే అన్నారా లేదంటే నిజంగానే సినిమా చేస్తారో తెలియదు గానీ.. నిజమైతే మాత్రం క్రేజ్ మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయిపోతారు. ప్రస్తుతం టిల్లు క్యూబ్, మ్యాడ్ క్యూబ్ సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. మరి అవి రెండు వస్తాయా లేదంటే రవితేజతో సినిమా వస్తుందా అనేది చూడాలి.
Read Also : Vishal : ఆ హీరో పక్కన కత్తిలాంటి ఇద్దరు హీరోయిన్లు.. మామూలుగా ఉండదా
