మాస్ మహారాజా రవితేజ సరైన సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. మరో సాలిడ్ హిట్ కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఎన్ని ప్రాజెక్టులు సెట్ చేస్తున్నా, అవి కిక్ ఇవ్వడం లేదు. అయితే, ఇప్పుడు ఆయన తన కిక్ ఇచ్చే ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి, రవితేజ కెరీర్‌లో కిక్ అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి కూడా ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ ఇవ్వలేదు. ఆయన కూడా హిట్ కాదు కదా, కనీసం ఇప్పుడు సినిమా డైరెక్ట్ చేసే అవకాశం వస్తే చాలని తిరుగుతున్నారు.
Also Read :Renu Desai : ఎట్టకేలకు సినిమా సైన్ చేసిన రేణు దేశాయ్.. కానీ?
ఇక వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేసే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చూచాయిగా కథ చెప్పడంతో రవితేజకి నచ్చిందని, దాన్ని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసుకో రమ్మని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ సిద్ధమైన తర్వాత నచ్చితే, రవితేజ మరోసారి కిక్ కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నట్లే చెప్పాలి. ప్రాజెక్టు డిస్కషన్ ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి, ప్రస్తుతానికి అంతకుమించిన విషయాలేవీ వెల్లడి కాలేదు. మొత్తం మీద రవితేజ కిక్ కాంబోతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తే హిట్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.
