అతను ఒక స్టార్ హీరో కొడుకు. ఇప్పటికే ఒక సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. అతను స్టార్ హీరో లెగసీ కంటిన్యూ చేస్తూ హీరోగా మారతాడనుకుంటే, అందుకు భిన్నంగా దర్శకత్వం వైపు మొగ్గుచూపుతున్నాడు. ఇంతకీ ఎవరు ఆ హీరో కొడుకు అనే అనుమానమే కలుగుతుందా? అతను ఇంకెవరో కాదు, హీరో రవితేజ కొడుకు మహాధన్. ప్రస్తుతానికి అతను వెంకీ అట్లూరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. వెంకీ అట్లూరి ఈ మధ్యకాలంలోనే లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
Also Read:Bandla Ganesh Party: ప్లేట్ 15వేలు.. నైటుకు కోటిన్నర
ప్రస్తుతానికి అతను సూర్య హీరోగా సూర్య 46వ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాకి రవితేజ కుమారుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. నిజానికి, అతనికి ముందు నుంచే దర్శకత్వం మీద ఆసక్తి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కోరి కోరి వెంకీ అట్లూరి వద్ద మహాధన్ జాయిన్ అయినట్లుగా సమాచారం. వీలయినంత త్వరలోనే దర్శకత్వం కూడా చేసేందుకు మహాధన్ ఆసక్తి కనబరుస్తున్నాడు. అయితే, తన తండ్రితోనే మొదటి సినిమా చేస్తాడా లేక ఇతర హీరోలతో ప్రయత్నాలు చేస్తాడా అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ, దర్శకత్వం చేయడం అయితే ఖాయం అంటున్నాడు మహాధన్.
