Director Harish Shankar & Team Visited Ayodhya Ram Mandirమాస్ మహారాజా రవితేజ – మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ రీయూనియన్ గా చెప్పబడుతున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఉత్తరప్రదేశ్ లో 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా టీం. కీలక షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేయడంతో దర్శకుడు హరీష్ శంకర్ అండ్ సినిమా యూనిట్ ఆ దగ్గరలోనే ఉన్న అయోధ్య ఆలయాన్ని సందర్శించి రామ్ లల్లా ఆశీస్సులు తీసుకున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఆలయాన్ని సందర్శించిన దృశ్యాలను కలిగి ఉన్న వీడియోను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే కనుక హరీష్ శంకర్ ఎప్పటి లాగే శర వేగంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
రవితేజను పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తుండగా ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఇక మరో పక్క ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి నామ్ తో సునా హోగా అనేది ట్యాగ్ లైన్. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సీనియాకి అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్ కాగా మిగిలిన నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారని చెబుతున్నారు.