NTV Telugu Site icon

Ravi Babu: అవును.. నాకు పూర్ణతో ఎఫైర్ ఉంది.. కానీ

Purna

Purna

Ravi Babu: స్టార్ డైరెక్టర్ రవిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లరి సినిమాతో నవ్వించినా.. అవును సినిమాతో భయపెట్టినా.. అదుగో సినిమాతో ప్రయోగాలు చేసినా.. రవిబాబు వలనే అవుతుంది. ఇక సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన రవిబాబు.. ఈ మధ్యనే అసలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈటీవీ విన్ ఓటిటీలో రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే రవిబాబు.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇక ఎప్పటినుంచో రవిబాబుకు, పూర్ణకు మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇప్పటివరకు వాటిఫై పూర్ణ స్పందించింది లేదు.సందర్భాన్ని బట్టి రవిబాబు.. ఈ ఎఫైర్ విషయమై స్పందిస్తూ ఉంటాడు.

Supriya Yarlagadda: నేను నాలుగు సార్లు పారిపోతే.. పవన్ తీసుకొచ్చి

తాజాగా మరోసారి ఈ ఎఫైర్ పై రవిబాబు మాట్లాడుతూ.. ” అవును.. నాకు పూర్ణతో ఎఫైర్ ఉంది.. కానీ, మీరనుకొనేలా కాదు.. తప్పుగా అనుకోకండి. ఒక దర్శకుడికి తన నటులతో అలాంటి అనుబంధమే ఉండాలి. డైరెక్టర్ చెప్పినదానికన్నా 200 పర్సెంట్ పూర్ణ చేస్తోంది. అందుకే ఆమెతో ఎక్కువ సినిమాలు చేశాను. అయినా కూడా ఆమె నా కథలు నచ్చితే.. అందుకు ఆమె న్యాయం చేయగలదు అని నమ్మితేనే సినిమా ఒప్పుకొంటుంది. మొన్నీమధ్య నా కొత్త సినిమా వాషింగ్ మెషిన్ కోసం ఆమెను అడిగాను. ఎందుకో నాకు ఇది సెట్ అవ్వదనిపిస్తుంది అండీ.. అని నో చెప్పేసింది. అంతేతప్ప నాకోసం ఒప్పుకోలేదు.. అలా ఒప్పుకోకూడదు కూడా .. ఇప్పటివరకు పూర్ణ చేసిన సినిమాలు ఆమెకు నచ్చినవే” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రవిబాబు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.