NTV Telugu Site icon

Rashmika: గర్ల్ ఫ్రెండ్ గా మారిన నేషనల్ క్రష్…

Rashmika

Rashmika

నేషనల్ క్రష్ రష్మిక మందన్న అనిమల్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. హిందీలో రష్మికకి ఆశించిన క్రేజ్ రాలేదు, ఆ లోటుని అనిమల్ సినిమా తీర్చేసేలా ఉంది. అనిమల్ మూవీ నార్త్ లో సాలిడ్ హిట్ అయితే రష్మిక నార్త్ లో సెట్ అయిపోయినట్లే. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న రష్మిక మందన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలని కూడా లైన్ లో పెడుతుంది. ఇప్పటికే రెయిన్బో అనే సినిమాతో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాని చేస్తున్న రష్మిక… లేటెస్ట్ గా చి లా సౌ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ తో కలిసి “ది గర్ల్ ఫ్రెండ్” అనే సినిమా చేస్తుంది. గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది.

ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లింగ్ లవ్ గా తెరకెక్కనున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. ఈ ఈవెంట్ కి రష్మిక రాలేదు కానీ అల్లు అరవింద్, రాహుల్ రవీంద్రన్, మారుతీ, సాయి రాజేష్, కరుణాకరన్ లు అటెండ్ అయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, డైరెక్టర్ మారుతి కెమెరా స్విచ్ఛాన్ చేశాడు. డైరెక్టర్ సాయి రాజేశ్ ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. అనిమల్ సినిమా ప్రమోషన్స్ కంప్లీట్ చేసుకోని రష్మిక ఫ్రీ అవ్వగానే అతి త్వరలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లనుంది.