Rashmika : కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా నిర్వహించారు. నాగార్జున, ధనుష్, రష్మిక లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నారు. ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతుందంటే నమ్మలేకపోతున్నా. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేశాను.
Read Also : Kubear Pre Release Event : నాకు, శేఖర్ కమ్ములకు తేడా అదే.. రాజమౌళి కామెంట్స్..
శేఖర్ కమ్ముల గారితో మూవీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాగార్జున సార్ తో మంచి అనుబంధం ఉంది. మరోసారి ఆయనతో పనిచేస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఆయనతో మరిన్ని మూవీలు చేస్తా. ధనుష్ గారితో ఫస్ట్ టైమ్ నటిస్తున్నా. ఇది స్టార్టింగ్ మాత్రమే.. ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నా.
రీసెంట్ గా ట్రైన్ యాక్సిడెంట్ చూశాక స్టన్ అయిపోయాను. నేను ఎక్కువ ట్రైన్ జర్నీలు చేస్తుంటాను. ఆ యాక్సిడెంట్ చూశాక చాలా బాధేసింది. మన లైఫ్ చాలా సింపుల్. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు పోతామో తెలీదు. కాబట్టి హ్యాపీగా ఉండండి. సేఫ్టీగా ఉండండి. అంతకు మించి ఇంకేం వద్దు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
Read Also : Dilraju : దిల్ రాజు అసంతృప్తి.. ఆ హీరోలు రానందుకేనా..?
