విజయ్ దేవరకొండ హీరోగా యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ కాంబోలో వచిన టాక్సీవాలా సూపర్ హిట్ అందుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత వీరిద్దరు మరోసారి ఓ బలమైన కథ, కథనాలతో రాబోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. గతేడాది మే నెలలో ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ షూటింగ్ ఈ నెల 30న రిలీజ్ కు రెడీగా ఉంది. రిలీజ్, ప్రమోషన్స్ వగైరా వ్యవహారాలు ముగించేసి రాహుల్ సినిమా సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు విజయ్. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా పలువురి పేర్లు వినిపించగా ఫైనల్ గా రష్మిక మందన్నను ఫిక్స్ చేశారు. గతంలో విజయ్, రష్మిక జోడిగా వచ్చిన గీతగోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కాగా 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాదాపు 5 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ హిట్ పెయిర్ కలిసి నటించనున్నారు. అసలే విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ లో ఉన్నారని ఇటీవల వార్తలు నెట్టింట హల్ చల్ చేసాయి. ఈ నేపధ్యంలో ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై మెరిసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హింది భాషలలో రానుంది.
