Site icon NTV Telugu

The Girlfriend : రష్మిక మందన్న మ్యాజిక్‌కి నెట్‌ఫ్లిక్స్ భారీ చెక్ – ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఫ్యాన్సీ డీల్

Rashmika Mandana The Gorl Friend

Rashmika Mandana The Gorl Friend

ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రసీమలో తన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో సంచలన సృష్టిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నేషనల్ అవార్డు విజేత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన అప్ డేట్స్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా ఓటీటీ రైట్స్ దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ రూ.14 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ డీల్ రష్మిక హిట్టు సినిమాను ఇంటర్నేషనల్ ఆడియెన్స్‌కి పరిచయం చేసే అవకాశం ఇస్తుంది. ఇక దీని ట్రైలర్ అక్టోబర్ 25న విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది, ట్రైలర్ రిలీజ్‌కు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read : SSMB29 : SSMB29 నుంచి సౌండ్‌ మొదలైంది – కాలభైరవ రివీల్ చేసిన ఆసక్తికర అప్‌డేట్!

సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తుండగా, రావు రమేష్, రోహిణి వంటి నటులు కీలక పాత్రల్లో ఉన్నారు. అందాల భామ అనూ ఇమ్మాన్యుయేల్ ప్రత్యేక పాత్రలో మెప్పించనుంది. చిత్రానికి సంగీతం హేషామ్ అబ్దుల్ వహాబ్ అందిస్తున్నాడు. నిర్మాణ బాధ్యతలు విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని చేపట్టారు, సమర్పణ హక్కులు అల్లు అరవింద్ కలిగి ఉన్నారు. ఇలావుండగా, రష్మికకు ఈ సినిమా మరో మైలురాయి అవ్వనుంది. థియేటర్స్‌లో చూపిన విజయానంతరం, ఓటీటీ లాంచ్ ద్వారా ఆమె క్రేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి కూడా చేరుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో హిట్‌గా నిలవనుందనేది ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు.

Exit mobile version