Site icon NTV Telugu

Rashmika: టోక్యో ఎయిర్ పోర్ట్ లో రశ్మికకు సర్ ప్రైజింగ్ వెల్కమ్ చెప్పిన జపాన్ ఫ్యాన్స్

Rashmika At Japan

Rashmika At Japan

Rashmika Mandanna Fans Surprising Welcome for the star at Tokyo Airport:క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్లోని టోక్యో వెళ్లింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. రేపు టోక్యోలో క్రంచీ రోల్ అనిమీ అవార్డ్స్ జరగనున్నాయి. గ్లోబల్ ఈవెంట్ గా జరుగుతున్న ఈ అవార్డ్స్ కార్యక్రమంలో మన దేశం నుంచి రష్మిక రిప్రజెంట్ చేస్తోంది. ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా రష్మిక నిలిచింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టోక్యో ఎయిర్ పోర్ట్ లో ఆమెకు జపాన్ ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

Chaari 111 Review: వెన్నెల కిశోర్‌ ‘చారి 111’ రివ్యూ

రష్మిక ఫొటోస్ తో డిజైన్ చేసిన ఫ్లకార్డులు చూపిస్తూ ఆమెను ఆహ్వానించారు. అయితే ఎయిర్ పోర్ట్ లో అభిమానులు ఇచ్చిన వెల్కమ్ తో రష్మిక ఆశ్చర్యపోయింది. సర్ ప్రైజ్ అవుతూ వారికి హాయ్ చెప్పింది. పుష్ప, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో నేషనల్ క్రష్ గా మాత్రమే కాదు గ్లోబల్ గా రష్మిక అభిమానులను సంపాదించుకుంది. జపాన్ లోనూ రశ్మికకు ఫ్యాన్స్ ఉన్నారు. వారు తనపై చూపిస్తున్న ప్రేమకు రశ్మిక తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం రశ్మిక మందన్న “పుష్ప 2”, “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలతో పాటు ఓ హిందీ ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే ఆమె సోషల్ మీడియాలో కూడా బిజీ బిజీగా గడిపేస్తోంది.

Exit mobile version