Rashmika Mandanna Again Victim Of Deepfake Video Face Changed With Columbian Model : నటి రష్మిక మందన్న లిఫ్ట్‌లో ఉన్న డీప్‌ఫేక్ వీడియో వైరల్‌గా మారగా దాని కోసం ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేయడం మీకు గుర్తుండే ఉంటుంది . ఈ విషయంలో తనకు బాధగా ఉండటమే కాకుండా చాలా భయంగా ఉందని రష్మిక అప్పట్లో చెప్పింది. చాలా వివాదాల తరువాత, ఇప్పుడు ఆమె యొక్క మరొక డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, దీనిలో ఆమె ఎరుపు బికినీ ధరించి జలపాతం కింద నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో రష్మిక నటించిన ‘పుష్ప’ చిత్రంలోని ‘సామి సామి’ పాట కూడా ప్లే అవుతోంది. ఇక ఆ వీడియో చూసి అద్భుతం అంటూ కొందరు అంటుంటే.. చాలా మంది మాత్రం ఇది నిజమేనని భావించి హాట్ రష్మిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఫేక్ అని తేలింది.
Anand Deverakonda: రష్మికతో అలా కావాలనే చేశా.. సెట్ కూలిపోయింది అయినా తగ్గలేదు( ఇంటర్వ్యూ)
డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా దీన్ని రూపొందించారు. ఒరిజినల్ వీడియోలో, కొలంబియన్ మోడల్ డానియెలా విల్లారియల్ రెడ్ బికినీ ధరించి కనిపిస్తోంది. ఆమె ముఖంపై రష్మిక ముఖం డీప్ ఫేక్ ద్వారా సూపర్మోస్ చేయబడింది. వైరల్ వీడియో యొక్క కీఫ్రేమ్‌లను రివర్స్ సెర్చ్ చేయడం ద్వారా, ఇది ఏప్రిల్ 19న కొలంబియన్ మోడల్ అయిన డేనిలా విల్లారియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేయబడిందని కనుగొన్నారు. మీరు క్రింద అసలు వీడియోను చూడవచ్చు. డీప్‌ఫేక్ వీడియోలు ముందు వైపు నుండి బాగానే కనిపిస్తాయి, కానీ తరచుగా సైడ్ ప్రొఫైల్‌లో చూస్తే అది డీప్ ఫేక్ అని అర్ధం అవుతుంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది. ‘డీప్‌ఫేక్ డిటెక్షన్’ టూల్ ద్వారా పరిశీలిస్తే ఇందులో ‘ఫేస్ స్వాప్’ టెక్నిక్ ఉపయోగించారు. ఈ ‘ఫేస్ స్వాప్’ అనేది ఒక టెక్నిక్, దీని సహాయంతో, ఎడిటింగ్ ద్వారా, ఫోటో లేదా వీడియోలో కనిపించే ఒక వ్యక్తి ముఖాన్ని మరొక వ్యక్తి ముఖంతో మార్చవచ్చు.
