Rashmi: అందాల యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అమాయకత్వం, మానవత్వం అన్ని కలగలిపిన రూపం రష్మీ. జంతువులకు ఏదైనా జరిగితే రష్మీ గుండె విలవిలలాడుతుంటుంది. మూగ జీవుల కోసం ఆమె ఎంతో పోరాడుతోంది. ఇక రష్మీ కొద్దిగా సమయం చిక్కినా తన స్నేహితురాళ్లతో కలిసి ఛిల్ల్ అవుతూ ఉంటుంది. మొన్ననే తన ఫ్రెండ్స్ బ్యాచ్ తో కలిసి మాల్దీవులు వెకేషన్ కు వెళ్లివచ్చింది. అక్కడ ముద్దుగుమ్మ అందాల ఆరబోతను తట్టుకోవడం కష్టమనే చెప్పాలి.
ఇక తాజాగా రష్మీ న్యూయర్ పార్టీని ఎంజాయ్ చేసింది. తానకు దగ్గర స్నేహితురాళ్లు అయిన దీపికా పిల్లి, మరొకరితో కలిసి అమ్మడు వైన్ పుచ్చుకుంది. ఈ వీడియోను రష్మీ పోస్ట్ చేస్తూ .. లాస్ట్ నైట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే రష్మీ ప్రస్తుతం యాంకర్ గా కంటిన్యూ చేస్తూనే హీరోయిన్ గా కూడా అలరిస్తోంది. ఇటీవలే బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన రష్మీ ప్రస్తుతం మంచి కథల కోసం ఎదురుచూస్తోందట. మరి రష్మీ హీరోయిన్ గా హిట్ అందుకుంటుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.
