NTV Telugu Site icon

Rashmi Gautam: స్టుపిడ్ అంటూ రెచ్చిపోయిన నెటిజన్.. దిమ్మతిరిగేలా కౌంటరిచ్చిన రష్మీ

Rashmi Gautam Serious

Rashmi Gautam Serious

Rashmi Gautam Strong counter to netizen: యాంకర్ గా, నటిగా దూసుకుపోతున్న రష్మీ మరోపక్క సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎక్కువగా నోరు లేని జీవాల పక్షాన ఉండి వాటి హక్కుల గురించి సోషల్ మీడియాలో తన వంతు పోరాటం చేసే ఆమె తాజాగా మతం అంశంలో ఎంటర్ అయ్యారు. ఒక స్టాండప్ కమెడియన్ వీడియోను రీట్వీట్ చేసిన రష్మీ అతని మీద విమర్శలు చేశారు. అయితే అతను ఏమీ మాట్లాడలేదు కానీ మరో నెటిజన్ రెచ్చిపోయి రష్మీ మీద కామెంట్లు చేయడంతో ఆమె కూడా ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదు అన్నట్టు రెచ్చిపోయి గట్టి కౌంటర్ ఇచ్చేసింది. అసలు విషయం ఏమిటంటే బీఫ్(గో-మాంసం) తినని వారిని ఎద్దేవా చేస్తూ ఒక స్టాండప్ కమెడియన్ కామెడీ చేయగా అతని వీడియోను రీట్వీట్ చేసిన రష్మీ మరేదైనా ఇతర మతం గురించి ఈ జోకులు వేస్తే వారు దానిని ఎలా తీసుకుంటారు? ఒకరినొకరు మతపరమైన భావాలను గౌరవించుకోవడం కూడా ముఖ్యం కదా. ప్రజలు సామరస్యంగా జీవించాలనుకుంటే కొన్ని మార్పులు చేయడం వల్ల మనుషులకే కాదు, గొంతులేని జీవాలకు కూడా కూడా మేలు జరుగుతుందని కామెంట్ చేసింది.

Sai Chand Son: కంటతడి పెట్టిస్తున్న సాయిచంద్ కుమారుడి ఫోటో!

అయితే దానికి సూర్య అనే నెటిజన్ స్పందిస్తూ మీరు ఏదో మూర్ఖపు వాటిని నమ్ముతారని ఇతరులు ఎందుకు మార్చుకోవాలి, ఎవరూ నిన్ను బీఫ్ తినమని బలవంతము చేయడం లేదు కదా. అంటే నువ్ బేసిక్ గా ఏమి చెబుతున్నావు, ఎవరైతే బీఫ్ తింటారో వాళ్ళని అంతం చేస్తాం అంటావా? ఎందుకంటే అలా తినే వారిని చంపడం కరెక్ట్ అని మీ మతం చెబుతుందా? అని ఆమెను ప్రశ్నించాడు. దానికి ఆమె స్పందిస్తూ నువ్వు పదేపదే స్టుపిడ్ అనడం మానేయి లేదనే నువ్ అదేనని అర్ధం అవుతుంది. అసలు ఎవరి మతాన్ని నువ్ స్టుపిడ్ అంటున్నావు? అసలు ముందు నీ అసలు ముఖం కనిపించేలా ప్రొఫైల్ పిక్ పెట్టుకో ఆ తర్వాత ఇలాంటి కామెంట్స్ చేయచ్చని ఆమె పేర్కొంది. దానికి ఆ నెటిజన్ ప్రొఫైల్ పిక్ తో పనేముంది అని ప్రశ్నించగా మీలాంటి వాళ్ళు శబ్దం చేయడమే తప్ప ఇంకేమీ చేయలేని వాళ్ళు, ఒకరి మనోభావాలను మీరు కించపరుస్తున్నారు అంటనే మీరు ఎలాంటి వారో అర్ధం చేసుకోవచ్చు. ముందు ముఖం చూపించి మాట్లాడడం నేర్చుకో ఆ తరువాత పాయింట్ గురించి మాట్లాడచ్చు అంటూ ఆమె కౌంటర్ ఇచ్చింది.

Show comments