సౌత్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా దాదాపు అని కవర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రజంట్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇందులో ‘తెలుసు కదా’ మూవీ ఒకటి. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమల మధ్య తేడా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : Bobby Deol : అతని వల్లే నేను ఇక్కడున్నా – బాబీ డియోల్ ఎమోషనల్ కామెంట్స్
రాశి మాట్లాడుతూ..‘తెలుగు సినిమా షూటింగ్‌లో ఒక్కరోజు సగటున 9 గంటలు మాత్రమే పని చేయాల్సి వస్తుంది, కానీ తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఒక రోజు 12 గంటల షిఫ్ట్ ఉండడం వల్ల నటీనటులు ఎక్కువ అలసిపోతారు. తెలుగు ఇండస్ట్రీలో అభిమానులు ఎక్కువగా ఉంటారు, సౌత్ ఇండస్ట్రీలోని నటీనటులు ఎక్కువ ప్రైవేట్‌గా, అంకితభావంతో పని చేస్తారు. కానీ బాలీవుడ్‌లో నటీనటులు కొంచెం ఆడంబరంగా ప్రవర్తిస్తారు, వారిలో సౌత్ హీరోల లాగా గౌరవం, విధేయత తక్కువగా కనిపిస్తుంది. సౌత్ ఇండస్ట్రీని చూసి నార్త్ ఇండస్ట్రీలో కొంతమంది నేర్చుకోవాలి ’ అని రాశి తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకి కారణమయ్యాయి. కొంతమంది ఫ్యాన్స్, “బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేయలేకపోయినందుకు నార్త్ ఇండస్ట్రీని తక్కువ చేసి, సౌత్ ఇండస్ట్రీని ఎక్కువ చూపించడం సరిపోదు” అని తెలిపారు. కానీ రాశి మాత్రం తన అనుభవం మాత్రమే చెప్పినట్లు వెల్లడించారు.
