బాలీవుడ్ సీనియర్ కథానాయిక రాణీ ముఖర్జీ, మూడు దశాబ్దాల పాటు ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించగా, ఇటీవల ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంలో రాణీ, తన సినీ జీవితం, మొదటి రోజులు, అవార్డులు, విమర్శలపై నిజమైన భావాలను పంచుకున్నారు.
Also Read : Mithra-Mandali: ‘మిత్ర మండలి’ని మనసుతో చూడండి.. హిట్ గ్యారెంటీ అంటూ శ్రీ విష్ణు!
‘‘సినీరంగంలోకి అడుగుపెట్టడం చాలా కష్టంగా జరిగింది. మొదట్లో నా తండ్రి రామ్ ముఖర్జీ నాకు సినిమాలో అవకాశాలివ్వాలని ఆసక్తి చూపలేదు. ఎందుకంటే అప్పట్లో సినిమా నేపథ్య కుటుంబాల పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు నటనను వృత్తిగా తీసుకోవడం సాధారణం కాదు. స్కూల్లోనూ నేను సినిమా కుటుంబం నుంచి వచ్చానని చెప్పలేదు. తల్లి కూడా ఒకసారి నన్ను సినిమా నుంచి తొలగించమని నిర్మాతను అడిగింది. చివరికి స్క్రీన్ టెస్ట్ తర్వాత మాత్రమే నటించడానికి అనుమతించారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి, ప్రతి ఒక్కరు చిన్న వయసులోనే నటిగా మారడానికి ఆసక్తి చూపుతున్నారు’’ అని ఆమె తెలిపారు. అలాగే రాణీ మాట్లాడుతూ, జాతీయ అవార్డు ప్రకటించినప్పుడు ప్రేక్షకుల అంగీకారం ఎంతో ముఖ్యం.. కానీ ‘‘అవార్డు వచ్చినప్పటికీ, ‘ఆమెకు ఎందుకు పురస్కారం వచ్చింది?’ అని విమర్శలు వింటే గుండె పగిలిపోతుంది. నిజంగా, ప్రేక్షకుల అంగీకారం నాకు అవార్డు కంటే గొప్పగా అనిపిస్తుంది. ప్రతి చిన్న అవార్డు, గుర్తింపు, అభిమానుల ఆనందం – ఇవన్నీ ఒక నటికి అత్యంత విలువైనవి’’ అని ఆమె చెప్పుకున్నారు.
