నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించిన ‘నటసమ్రాట్’ అనే మరాఠీ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెలుగులో ప్రకాశ్ రాజ్ కీలక పాత్రధారిగా ‘రంగ మార్తాండ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. జనవరి ప్రధమార్థంలో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అలీ రజా తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ శ్యామల ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మధు కాలిపు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్న ‘రంగమార్తండ’ మూవీని వేసవి కానుకగా విడుదల చేయబోతున్నట్టు మధు కాలిపు తెలిపారు.
‘మిస్ ఇండియా’ దర్శకుడితో కొత్త సినిమా
కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషించిన ‘మిస్ ఇండియా’ సినిమాతో నరేంద్రనాథ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అతని దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాను నిర్మించబోతున్నట్టు మధు కాలిపు తెలిపారు. కథా ప్రాధాన్యమున్న చిత్రాలతో పాటు భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలనూ తమ బ్యానర్ నుండి నిర్మిస్తామని ఆయన అన్నారు. అందులో భాగంగా నరేంద్ర నాథ్‌తో మూవీ తెరకెక్కించబోతున్నామని, అతి త్వరలోనే దీని షూటింగ్ మొదలవుతుందని చెప్పారు.
