Site icon NTV Telugu

Randeep Hooda: నిఖిల్ కి పోటీగా… సావర్కర్ కథతో మరో సినిమా

Randeep Hooda

Randeep Hooda

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ‘ది ఇండియా హౌజ్’. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ అనౌన్స్మెంట్ గ్రాండ్ గా జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు ‘వీర్ సావర్కర్’ కథతో లింక్ ఉన్న స్టోరీతో ‘ది ఇండియా హౌజ్’ తెరకెక్కుతోంది. నిఖిల్ ఈ మూవీలో ‘శివ’ అనే క్యారెక్టర్ ప్లేచేస్తున్నాడు. ‘ది ఇండియా హౌజ్’ చిత్ర యూనిట్ కి షాక్ ఇస్తూ మరో సినిమా కూడా ‘వీర్ సావర్కర్’ కథతో తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న యాక్టర్స్ లో రణదీప్ హుడా ఒకరు. ఎన్నో సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న రణదీప్ హుడా డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘సావర్కర్’. ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ టీజర్ ‘వీర్ సావర్కర్ 140వ జయంతి నాడు’ రిలీజ్ చేసారు.

Read Also: Prabhas: అంతా ఆదిపురుష్ మయం… ఇంకో టాపిక్ లేదు

భగత్ సింగ్, కుదిరామ్ బోస్ లాంటి లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ నే ప్రేరేపించిన గొప్ప నాయకుడు సావర్కర్. అలాంటి నాయకుడి కథని ఎవరు చంపేశారు? ఎందుకు చంపేసారు అంటూ రణదీప్ హుడా ‘సావర్కర్’ టీజర్ ని సూపర్బ్ గా ప్రెజెంట్ చేసాడు. టీజర్ లో రణదీప్ హుడా ‘సావర్కర్’ పాత్ర కోసం పడిన కష్టం కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇదే సమయంలో నిఖిల్ నటిస్తున్న ‘ది ఇండియా హౌజ్’ సినిమాకి ‘సావర్కర్’ సినిమాకి మధ్య పోలికలు ఉంటాయా? రెండూ ఒకే కథతో తెరకెక్కుతున్నాయా అనేది చూడాలి. ఇప్పటికైతే రెండు సినిమాలు ఒకరి పేరుతోనే ప్రమోట్ అవుతున్నాయి… ‘వీర్ సావర్కర్’.

Exit mobile version