బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా- రణబీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహంతో ఒక్కటయ్యింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఈ జంట బిజీ బిజీ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇకపోతే రణబీర్, అలియా జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర.. ఆయన ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదుల కానుంది. ఇక ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తుండగా తెలుగులో రాజమౌళి విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఇప్పటినుంచే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం పలు ఇంటర్వ్యూ ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటుంది. ఇక ఒక ఇంటర్వ్యూలో రణబీర్ ను మీ వైవాహిక జీవితం ఎలా ఉంది అని అడుగగా..” ఐదేళ్లు మేము కలిసే ఉన్నాం.. పెళ్లి తరువాత కూడా అంత పెద్ద మార్పు ఏమి కనిపించలేదు.. ముందు నుంచి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం .. చేసుకున్నాం.. ఆ తరువాత ఇద్దరికీ కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నాయి.. వాటికి కట్టుబడి పెళ్లి జరిగిన నెక్స్ట్ డే నే ఇద్దరం షూటింగ్ లకు వెళ్లిపోయాం.. వీటిని పూర్తి చేసి కొద్దిగా గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాం.. అస్సలు ఇప్పటికీ అలియా తో నా పెళ్లి జరిగిందని అంటే నమ్మలేకపోతున్నా..” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
